AP Chief Secretary: ఏపీ కొత్త సీఎస్ ట్రాక్ రికార్డు ఇదే..
ABN , Publish Date - Dec 30 , 2024 | 07:16 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసేందుకుగానూ తనపై నమ్మకం ఉంచి సీఎస్‌గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ నూతన సీఎస్ గావిజయానంద్‌ను నియమిస్తూ ఆదివారం అర్ధరాత్రి జీవో ఆర్టీ నెంబర్ 2209ను జీఏడి పోలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (AP Chief Secretary) కె. విజయానంద్ (K.Vijayanand) నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ (S. Suresh Kumar) ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి సేవ చేసేందుకుగానూ తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)కు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ నూతన సీఎస్ గా ఆదివారం అర్ధరాత్రి జీవో ఆర్టీ నెంబర్ 2209ను జిఏడి పోలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్నారు.
కాబోయే సీఎస్... కె విజయానంద్ ప్రస్తానం...
1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కె విజయానంద్.. 1993లో అదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా కేరీర్ ప్రారంభించారు. తరువాత 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 1996 నుండి గ్రామీనాభివృద్ది శాఖ ప్రాజక్ట్ డైరెక్టర్‌గా.. తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా.. శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా 1998 నుండి 2007 వరకూ పనిచేశారు. అలాగే 2008లో ప్లానింగ్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విజయానంద్ భాద్యతలు నిర్వహించారు.
విద్యుత్ రంగంపై తనదైన ముద్ర...
విజయానంద్ 2022 నుండి ఏపి జెన్ కో ఛైర్మన్‌గా 2023 నుండి ఏపి ట్రాన్స్ కో ఛైర్మన్ అండ్ ఎండిగా, ఎనర్జీ డిపార్టమెంట్ స్పెషల్ సిఎస్‌గా పనిచేశారు. దీంతో పాటు ఎనర్జీ డిపార్టమెంట్ సెక్రటరీగా ఏపిపిసిసి, ఏపిఎస్పిసిఎల్, ఎన్ఆర్ఈడీసిఏపి, ఏపిఎస్ఈసిఎమ్ ఛైర్మన్‌గా ఇప్పటి వరకూ భాద్యతలు నిర్వహించారు. దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీకి ఛైర్మన్‌గా 2023-24 కు వ్యవహరించారు. కీలక సమయంలో విద్యుత్ సంక్షోభాలను పరిష్కరించడంలో విజయానంద్ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను సిఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో అమలులోకి తెచ్చారు. ఈ పాలసీ ద్వారా 160 గెగావాట్ల క్లీన్ ఎనర్జీని పెంపోందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాలసీ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 7లక్షల 50 ఉద్యోగాల కల్పనకు అవకాశం కలిగింది. 14 ఏళ్ల పాటు విద్యుత్ రంగాంలో ఆయన చేసిన సేవల వల్ల ఆ రంగంలో కీలక మార్పులు చేశారు. హుద్ హుద్, తిత్లీ లాంటి విపత్తుల సమయంలో కూడా విజయానంద్ విద్యుత్ పునరుద్ధరణ పనులు, పర్యవేక్షణ చూశారు.
ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో...
2016 నుండి 19 వరకూ ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎలక్ట్రానిక్ పాలసీ, డేటా సెంటర్ పాలసీల రూపాకల్పనతో హెచ్‌సిఎల్, టిఎసిఎల్ వంటివి ఏపికి రావడంలో విజయానంద్ కీలక పాత్ర పోషించారు. కాగా సీఎస్ గా నియమితులు అయిన కె విజయానంద్‌కు పలువురు అఖిల భారత సర్వీసు అధికారులు శుభాకంక్షలు తెలిపారు. కాగా తనను సీఎస్‌గా ఎంపిక చేసినందుకు సీఎం చంద్రాబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖమంత్రి నారాలోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో పాటు మంత్రి వర్గంలోని అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బలహీన వర్గాల అభివృద్దికి కృషి..
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలతోపాటు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేస్తానని విజయానంద్ ప్రకటించారు. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ సేవలు మరిచిపోకూడదని విజయానంద్ అన్నారు. వైయస్సార్ కడప జిల్లా, రాజుపాలెం మండలం, అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం.. 2025 నవంబర్ వరకు విజయానంద్ సీఎస్‌గా కొనసాగనున్నారు. సీనియారిటీ ప్రకారం జలవనురుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ముందున్నారు. అయితే సాయి ప్రసాద్‌కు 2026 ఏప్రిల్ వరకు సర్వీసు ఉండడంతో ప్రభుత్వం విజయానంద్ వైపు మొగ్గు చూపింది. సీనియర్ అయినా సాయి ప్రసాద్‌ను సీఎస్‌గా నియమిస్తే ఆయన పదవీకాలం ముగియకముందే విజయానంద్ రిటైర్ కానున్నారు. దీనితో ప్రభుత్వం సీఎస్‌గా విజయానంద్‌కు అవకాశం కల్పించింది. విజయానంద్ పదవీకాలం ముగిశాక సీఎస్‌గా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను నియమించే అవకాశం ఉంది. కాగా సీఎస్‌గా విజయానంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఇరువురిని పిలిచి తన నివాసంలో మాట్లాడి కలిసి పని చేసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు వారికి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రైవేట్ బ్యాంకులకు తప్పని ఉద్యోగుల వలసలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News