CRDA: సీఆర్డీయేలో లంచాల బోగోతం..
ABN , Publish Date - Dec 08 , 2024 | 09:24 AM
సీఆర్డీయేలో లంచాల బోగోతం కలకలం రేపుతోంది. తుళ్ళూరులో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అధికారులు నగదు డిమాండ్ చేస్తున్నారని, లక్ష రూపాయలు ఇస్తేనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా: సీఆర్డీయేలో లంచాల బోగోతం కలకలం రేపుతోంది. రాజధాని రైతులను (Amaravati Farmers) లంచాల కోసం సీఆర్డీయే అధికారులు (CRDA Officers) వేదింపులకు గురి చేస్తున్నారు. రైతులకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షల్లో నగదు డిమాండ్ చేస్తున్నారు. తుళ్ళూరులో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదు డిమాండ్ చేస్తున్నారని, లక్ష రూపాయలు ఇస్తేనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్లు. కింది స్దాయి ఉద్యోగులతో నగదు వసూళ్లు చేయిస్తున్నట్లు సమాచారం. లంచాలు ఇచ్చుకోలేక, బయటకు చెప్పుకోలేక రాజధాని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కాగా ఈ నెల 2న సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అథారిటీ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీయే, ఏడీసీ అధికారులు హాజరయ్యారు. మొత్తం 23 అంశాలు ఎజెండాగా సీఆర్డీయే అథారిటీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కాగా అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బ్యాలెన్స్ రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించేందుకు సీఆర్‌డీఏ అధికారులు నవంబరు 23వ తేదీన ఈ-లాటరీ నిర్వహించారు. విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ-లాటరీ నిర్వహించారు. రాజధానిలోని 9 గ్రామాల రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ (ఓఆర్‌ఎస్) ద్వారా రిటర్నబుల్ ప్లాట్లను కేటాయిస్తున్నారు.
మరోవైపు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యాని కంటే నెల ముందుగా అంటే రెండు నెలల్లోనే పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఆర్‌డీఏ కాంప్లెక్స్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మునిసిపల్ మంత్రి నారాయణ విజ్ఞప్తి చేయగా.. కాంట్రాక్టు సంస్థ ఆ మేరకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అమరావతిలో సీఆర్‌డీఏ కాంప్లెక్స్ పూర్తి కాగానే.. మునిసిపల్ శాఖలన్నింటినీ అక్కడకు తరలించనున్నారు. మునిసిపల్ పట్టాణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ), కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ (సీడీఎంఏ), కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ తదితర మునిసిపల్ సంబంధిత రాష్ట్ర శాఖలన్నీ సీఆర్‌డీఏ కాంప్లెక్స్‌లో కొలువు తీరనున్నాయి. సీఆర్‌డీఏ కాంప్లెక్స్ పనులను 2017లో ప్రారంభించి రూ. 61.48 కోట్లు ఖర్చు చేశారు.
పెండింగ్ సివిల్ పనులతో పాటు ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్ ఫినిషింగ్ వర్క్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు రూ. 160 కోట్ల వ్యయంతో బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు కిందటి నెలలో టెండర్లు పిలిచారు. ఆ వెంటనే రూ.129 కోట్ల వ్యయంతో ఆర్కిటెక్చరల్ వర్క్స్, ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్, ఎంఈపీఎఫ్ వర్క్స్, ఐసీటీ వర్క్స్ ఎక్సటర్నల్ డెవల్‌పమెంట్ వర్క్స్‌కు టెండర్లు పిలిచారు. నాలుగు సంస్థలు టెండర్లు వేయగా.. ఎల్ 1గా నిలిచిన కేపీసీ ప్రాజెక్ట్స్‌కు పనులు అప్పగించారు. ఇక రాజధానిలో అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎన్జీఓ, ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాలు, ప్రభుత్వ టైప్ - 1 , టైప్ - 2 భవనాల పనులకు జనవరిలో టెండర్లు పిలవనున్నారు. గతంలో పిలిచిన టెండర్లన్నింటినీ రద్దు చేశారు. రాజధానిలో రోడ్ల పనులకు సంబంధించి డిసెంబరులో టెండర్లు పిలవనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
మా పోస్టులు రెవెన్యూ వాళ్లకా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News