CM Chandrababu: చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీఠ..
ABN , Publish Date - Dec 30 , 2024 | 08:59 AM
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీలకు మరో సారి పెద్దపీఠ వేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం లభిస్తుంది. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలోగాని ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బీసీ (BC)లకు మరో సారి పెద్దపీఠ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ అధికారి కె.విజయానంద్ (K. Vijayanand)కు అవకాశం కల్పించారు. 1992 బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ పోస్ట్ (Top Post) ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం లభిస్తుంది. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలోగాని ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తొలి సారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా బీసీ అధికారి శ్యామలరావు ఉన్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు కూడా బీసీనే.. అటు ప్రభుత్వంలోను, పార్టీలోనూ, బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం కల్పించారు. అలాగే తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్ ఉన్నారు. శాసన సభ స్పీకర్‌గా మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడుకు అవకాశం ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే జగన్ రెడ్డి నియమించారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం(31వ తేదీ) పదవీ విరమణ చేయన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. అనంతరం ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాగా, ఈ పోస్టుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. వీరిలో జి. సాయి ప్రసాద్ పేరు ప్రముఖంగా తెరమీదికి వచ్చింది. అయితే, ఈయనకు సర్వీసు ఇంకా ఉండడంతో విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. కాగా, తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేక పరిస్థితులు: చంద్రబాబు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన జీవో జారీకి ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయిప్రసాద్, విజయానంద్‌లతో ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇద్దరూ సీనియర్లే అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో విజయానంద్‌కు సీఎస్‌గా అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇద్దరూ రాష్ర్టాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సీనియర్ ఐఏఎస్‌ల సహయ, సహకారాలు ప్రభుత్వానికి చాలా అవసరమని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కొత్త సీఎస్ ట్రాక్ రికార్డు ఇదే..
ప్రైవేట్ బ్యాంకులకు తప్పని ఉద్యోగుల వలసలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News