Share News

CM Chandrababu: ‘స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్’...

ABN , Publish Date - Dec 12 , 2024 | 10:03 AM

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు గురువారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు.

CM Chandrababu: ‘స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్’...

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రెండో రోజు గురువారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు (Collectors), ఎస్పీ (SPs)లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు, వంటి అంశాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. అలాగే రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించనున్నారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే సదస్సులో వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రెండో రోజు హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు.


కాగా తొలి రోజు బుధవారం కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ‘‘ప్రజలతో గౌరవంగా ఉండండి. వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ప్రజలకు మన పనులు నచ్చేలా చేయాలి’’ అని కలెక్టర్లను ఆదేశించారు. మానవత్వంతో ఆలోచించి పనిచేయాలని సూచించారు. కలెక్టర్ల సమర్థత వల్లే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ‘‘ప్రభుత్వం మంచి పాలసీలు తీసుకొచ్చినా, వాటిని మీరే అమలుచేయాలి. మనమంతా ప్రజలకు సేవకులుగా ఉందాం. పీపుల్‌ ఫస్ట్‌ అనేది మన నినాదం కావాలి’’ అని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. ‘‘రాష్ట్రంలో పరిస్థితి గాడిలో పడుతోంది. ఇప్పుడిప్పుడే చీకట్లు తొలగిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ప్రజలు మాట్లాడటానికి భయపడేవారు. ఇప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చింది. బయట ప్రజలు నవ్వుతూ ఉన్నారంటే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడినట్టే! దీనిని కొనసాగించేలా మన పాలన కొనసాగాలి’’ అని చంద్రబాబు అన్నారు. విధ్వంసం తర్వాత జరిగే పునర్నిర్మాణానికి అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో అధికారులకు కూడా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి కాదని, ఈ ప్రభుత్వం వచ్చాక జీతాలు, పెన్షన్లు మొదటి తేదీనే ఇస్తున్నామన్నారు. ‘‘గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు. పక్క రాష్ర్టాలకు వెళ్తే ఏపీ గురించి అవహేళన చేసే పరిస్థితికి దిగజార్చారు. ఈ ఆరు నెలల్లో మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయి. మళ్లీ రాష్ర్టానికి బ్రాండ్‌ పెరుగుతోంది. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో ఇంకా వేగం పెంచాలి. ఇందుకు కలెక్టర్లలో పోటీ వాతావరణం రావాలి. ఇన్నేళ్లలో తొలిసారి ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నాను. రూ.10లక్షల కోట్ల అప్పులు పేరుకుపోయాయి. రూ.లక్ష కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఆదాయం లేదు. అభివృద్ధి జరిగితే సంపద వల్ల ఆదాయం వస్తుంది. పోనీ అప్పులు చేద్దామంటే ఎఫ్‌ఆర్‌బీఎం అనుమతించలేని దుస్థితి వచ్చింది’’ అని చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


గతంలో తాను ఎప్పుడూ రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చూడలేదని.. ఈ అక్రమాలను పునాదులతో సహా పెకలించివేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. రెండు నెలల్లో మొత్తం కట్టడి కావాలని, గతంలో పొలం గట్లు కబ్జా మాత్రమే జరిగేదని.. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పోర్టులు, సెజ్‌లు కజ్జాకు గురయ్యాయన్నారు. అందుకే ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తీసుకొచ్చామని, యంత్రాంగంలో ఇంకా పాత వాసనలు పోలేదన్నారు. అక్కడక్కడా కొన్ని విషయాల్లో తనకు కూడా తెలియకుండా చేస్తున్నారని, అలాంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

జనం మెచ్చేలా! మనం నచ్చేలా పాలన

రేషన్‌ మాఫియాకు కళ్లెం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 12 , 2024 | 10:03 AM