CM Babu: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:14 PM
స్వర్ణాంధ్ర 2047 పది సూత్రాలు.. పేదరికంలేని సమృద్ధికరమైన అవకాశాలు అందించే అద్భుత ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలకు కేంద్రంగా రానున్న రోజుల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆవిష్కృతమయ్యేలా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన పది సూత్రాలు స్వర్ణాంధ్రకు మార్గదర్శకాలు.
అమరావతి: స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి విజయవాడ నగరం వేదిక అయింది. శుక్రవారం ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెద్దఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరయ్యారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో స్వర్ణాంధ్ర @ 2047 పై ఏర్పాటు చేసిన స్టాల్‌లను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రులు సందర్శించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
స్వర్ణాంధ్ర 2047 పది సూత్రాలు..
స్వర్ణాంధ్ర 2047 పది సూత్రాలు.. పేదరికంలేని సమృద్ధికరమైన అవకాశాలు అందించే అద్భుత ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలకు కేంద్రంగా రానున్న రోజుల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆవిష్కృతమయ్యేలా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన పది సూత్రాలు స్వర్ణాంధ్రకు మార్గదర్శకాలు. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైన వనరులు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశాలు కల్పించడం ఈ సూత్రం ప్రధాన లక్ష్యం.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్.. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ముఖ్య ఉద్దేశం. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు - వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్), శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశలలో సమగ్ర సాంకేతికత వంటి 10 సూత్రాలతో విజన్ 2047 రూపొందించారు.
స్వచ్ఛాంధ్ర స్టాల్ వద్ద సీఎం ఛలోక్తులు
స్వచ్ఛాంధ్ర స్టాల్ వద్ద సీఎం చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలని సూచించారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారంటూ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. మహిళా రైతులతో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఆర్థికాభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌ను 10సూత్రాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరారు. మహిళా ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని డ్వాక్రా మహిళ సుహాసిని అన్నారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజన్ స్వర్థాంధ్ర 2047పై ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు, అధికారులు తరలివచ్చిన నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. విజయవాడలోకి భారీ వాహనాలు రాకుండా నగరం వెలుపల నుంచే వాటి రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు అవనిగడ్డ మీదుగా మళ్లించనున్నట్లు చెప్పారు. చెన్నై- హైదరాబాద్ వెళ్లే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అజ్ఞాతంలో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు..
ప్రజా సమ్యస్యల మీద పోరాడే ఫార్ములే కేటీఆర్..
మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News