Share News

CPI: యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

ABN , Publish Date - Dec 05 , 2024 | 07:33 AM

యురేనియం తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రయత్నించటం తగదని అన్నారు.

 CPI: యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu)కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) లేఖ (Letter) రాశారు. నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తూ ప్రకటన చేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రయత్నించటం తగదని అన్నారు. ప్యాపిలి మండలంలో మామిడిపల్లి, రాంపల్లి, జక్కసానికుంట గ్రామాల్లో ప్రజలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారని, యురేనియం తవ్వకాల వల్ల స్థానిక గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయి పలు ఇబ్బందులు, అనారోగ్య సమస్యల పాలయ్యే ప్రమాదం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.


కాగా యురేనియం తవ్వకాలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జక్కసానికుంట్ల గ్రామంలో రామకృష్ణ ర్యాలీ చేపట్టారు. అనంతరం గ్రామ శివారులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతారని, గతంలో జార్ఖండ్‌ రాష్ట్రంలో 600 మందికిపైగా కేన్సర్‌ బారిన పడ్డారని తెలిపారు. ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాల వల్ల మూడు గ్రామాల ప్రజలే కాక గుడిపాడు, ప్యాపిలి, రాయలచెరువు వరకు దీని ప్రభావం ఉంటుందని వివరించారు. ఈ విషయమై అన్ని పార్టీలతో చర్చించి, ముఖ్యమంత్రికి లేఖ రాస్తానన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారని చెప్పారు. ప్రజల నిరసనలతో తవ్వకాలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు ప్యాపిలి మండలంలో తవ్వకాలకు సన్నద్ధం కావడం సరికాదన్నారు.


అలాగే ప్యాపిలిలో మండలంలో యురేనియం తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం (నవంబర్ 21) ప్యాపిలిలో సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా రోడ్డుపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ ప్యాపిలి మండలంలోని జక్కసానికుంట్ల, రాంపురం, మామిళ్లపల్లి గ్రామాల్లో యురేనియం తవ్వకాల కోసం ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. యురేనియం తవ్వకాల వలన పర్యావరణం దెబ్బ తింటుందన్నారు. తవ్వకాల ద్వారా వచ్చే వాయువుతో వాతావరణం విషతుల్యంగా మారి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలను ఉమ్మడి జిల్లా మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, టీజీ భరత, ఎస్‌ఎండీ ఫరూక్‌, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఫ్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

వణికించిన భూకంపం

మాఫియా మోడల్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 05 , 2024 | 07:47 AM