CPM: విజయవాడలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం
ABN , Publish Date - Apr 04 , 2024 | 01:50 PM
విజయవాడ: సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ భేటీలో పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ: సీపీఎం (CMP) రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ భేటీలో పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu), సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasarao) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మిమ్స్ (Mims), ఆంధ్రపేపర్ లిమిటెడ్ (Andhra Paper Limited) కార్మికుల (Workers) నిరవధిక సమ్మె (Strike)లకు సీపీఎం సంపూర్ణ మద్దతు (Support) తెలుపుతుందన్నారు. కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిస్కరించాలని డిమాండ్ చేశారు. మిమ్స్‌లోనూ, ఆంధ్రపేపర్ లిమిటెడ్‌లోనూ యాజమాన్యాల మొండి వైఖరి వల్లే కార్మికుల నిరవధిక సమ్మెలు సాగుతున్నాయన్నారు.
ఆంధ్రపేపర్ లిమిటెడ్‌లో గత 4 సంవత్సరాల నుంచి వేతన ఒప్పందాలు చేయకుండా యాజమాన్యం కాలయాపన చేసిందని శ్రీనివాసరావు ఆరోపించారు. గత 6 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం సుమారు రూ. 200 కోట్ల నికర లాభాలు ఆర్జించిందన్నారు. గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరగకుండా కోర్టులను అడ్డుపెట్టుకొని నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. సీనియర్ కార్మికులను తొలిగించి.. కొత్త కార్మికులను విధుల్లోకి తీసుకుని వారికి చట్టవిరుద్ధంగా తక్కువ జీతాలు చెల్లిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని శ్రీనివాసరావు అన్నారు.