Share News

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:00 PM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాని జగన్ శాసనమండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనను వెంటాడుతోందని సెటైర్ విసిరారు.

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు
MLA Yarlagadda Venkatrao

అమరావతి, డిసెంబర్ 26: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former MLA YS Jaganmohan reddy) , వైసీపీ ఎమ్మెల్యేలపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Gannavaram MLA Yarlagadda Venkatrao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభకు వెళ్లకూడదని జగన్ నిర్ణయించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే బాధ పడుతున్నారని వెంకట్రావు చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసలు శాసనసభను చూస్తామా లేదా అని మదనపడుతున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శాసనసభకు రాని జగన్ శాసనమండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనను వెంటాడుతోందని సెటైర్ విసిరారు.


రాజ్యసభ, లోక్‌సభలో కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటకి అక్కడికి వైసీపీ సభ్యులు ఎలా వెళుతున్నారని నిలదీశారు. బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలు తిరస్కరించారని.. అందుకు ప్రజలను నిందిస్తారా అంటూ మండిపడ్డారు. భాషపై కూడా దాడి చేసిన ప్రభుత్వం జగన్ ది అంటూ విరుచుకుపడ్డారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని అడిగారు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని గుర్తించాలని జగన్‌కు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు.

కోహ్లీకి కోలుకోలేని షాక్


నువ్వు పెంచిన చార్జీలపైనే ధర్నానా.. జగన్‌పై మంత్రి గొట్టిపాటి సెటైర్

gottipati-ravikumar.jpg

అమరావతి: తుగ్లక్ చర్యల్లో మాజీ సీఎం జగన్ రెడ్డి మరో మైలురాయి దాటారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యలు చేశారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారని సెటైర్ విసిరారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిదే అని అన్నారు. సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. పీపీఏల రద్దు, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణం అయ్యారన్నారు. జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారని.. నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోనే వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరాయన్నారు. వాయిదా వేస్తూ... కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

సీఎంతో సమావేశం.. కింగ్ నాగార్జున ప్రతిపాదనలివే..

Viral: బ్రిటన్‌లో ఉండలేనంటూ తిరిగొచ్చిన భారతీయ డాక్టర్! కారణం తెలిస్తే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 04:01 PM