Share News

AP News: కార్మికుల సమ్మెతో ఏపీలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త

ABN , Publish Date - Jan 10 , 2024 | 12:56 PM

అమరావతి: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటోంది. ఓ వైపు అంగన్ వాడీలు, మరోవైపు పారిశుద్ద్య కార్మికుల సమ్మెలతో ఏపీ అట్టడికిపోతోంది. కనీస వేతనం కోసం మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో...

AP News: కార్మికుల సమ్మెతో ఏపీలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త

అమరావతి: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటోంది. ఓ వైపు అంగన్ వాడీలు, మరోవైపు పారిశుద్ద్య కార్మికుల సమ్మెలతో ఏపీ అట్టడుకిపోతోంది. కనీస వేతనం కోసం మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో 15 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె తారస్థాయికి చేరుకుంది. అరెస్టులు, వాగ్వివాదాలు, తోపులాటలతో ఉధృక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఏపీ వ్యాప్తంగా చెత్తా చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. తీవ్రమైన దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడతామంటూ మండిపడుతున్నారు. ఇదెక్కడి చెత్త పాలన అంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలవద్ద చెత్తా చెదారం పేరుకుపోయి ఎక్కడికక్కడ మురుగునీరు రోడ్డుపైకి వస్తోంది. వార్డుల్లో ఏ వీధిలో చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల డంపర్లు నిండిపోయి చెత్తంతా రహదారిపైకి వచ్చేసింది. దీనికి తోడు వీధి కుక్కలు, పందులు, పశువులు చెత్తను చిందరవందర చేస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం రాజ్యమేలుతోంది. దీనికితోడు దోమలు, ఈగలు విజృంభిస్తుండడంతో అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - Jan 10 , 2024 | 12:56 PM