Handloom Sector: జగన్ పాలనలో పూర్తిగా కుదేలైన చేనేత రంగం..
ABN , Publish Date - Jul 12 , 2024 | 11:53 AM
అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఎన్నికల ముందు ఆప్కోను ప్రక్షాళన చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి.. తీర అధికారంలోకి వచ్చాక చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేశారు. జగన్ రాసిన మరణ శాసనంతో ఆ సంస్థ పూర్తిగా కుంగి కృషించిపోయింది.
అమరావతి: వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) హయాంలో చేనేత రంగం (Handloom Sector) పూర్తిగా కుదేలైపోయింది. ఎన్నికల ముందు ఆప్కో (Apco)ను ప్రక్షాళన చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి (Jagan Reddy).. తీర అధికారంలోకి వచ్చాక చేనేత సహకార సంఘాలను (Handloom Co-operative Societies) నిర్వీర్యం చేశారు. జగన్ రాసిన మరణ శాసనంతో ఆ సంస్థ పూర్తిగా కుంగి కృషించిపోయింది. ఆయన హాయంలో ఆప్కో కుంభకోణాలకు నిలయంగా మారింది. రాజకీయ అవసరాల కోసం జనం సొమ్ము కాస్త స్వాహా చేశారు. అస్మదీయులకు మేలు చేయడం కోసం అవసరం లేని క్లాత్ కొనుగోలు చేసి గోడౌన్లలో నిలువ చేశారు. ఇప్పటికీ సోసైటీలవద్ద కోట్లాది రూపాయల విలువైన సరుకులు మూలుగుతున్నాయి. కరోనా సమయంలో మాస్కులు వ్యవహారంలో కూడా కక్కుర్తిపడిన సంఘటనలు తీవ్ర సంచలనం రేపాయి.
ఏపీలో నేతన్నల బతుకు భారమైంది.. ఊళ్లల్లో మగ్గం చప్పుళ్లు కరువయ్యాయి. నేత కార్మికులు.. భవన నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీలుగా మారిపోయారు.. తరతరాలుగా నమ్ముకున్న వృత్తి నేతన్నలను పస్తులు పెడుతోంది.. 2019 ఎన్నికలకు ముందు అంత చేస్తా.. ఇంత చేస్తా..అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో.. అలవికాని హామీలతో.. అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. తీరా అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు... సీఎం పీఠం ఎక్కగానే మొహం చాటేశారు.. చేనేత వర్గాలను ప్రోత్సహించేందుకు ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన.. ఆంధ్రప్రదేశ్ హ్యాండలూమ్స్ వీవర్స్ కో ఆపరేటీవ్ సొసైటీ - APCO జగన్ రెడ్డి హయాంలో కుంభకోణాలకు నిలయంగా నిలిచింది.. గత ఐదేళ్ల జగన్ పాలనలో చేనేత రంగం పూర్తిగా కుదేలైంది.. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను మార్కెట్‌లో అమ్మి, వారికి లాభాలు ఇచ్చేందుకు, సహకార సొసైటీలను ప్రోత్సహించేందుకు ఆప్కోను ఏర్పాటు చేశారు.. అయితే.. గత ఐదు సంవత్సరాల కాలంలో అడ్డదిడ్డమైన కొనుగోళ్లతో పాటు, అవసరం లేని క్లాత్‌ను కొనుగోలు చేసి గోడౌన్లలో నిల్వ చేశారు.. కమీషన్లకు కక్కుర్తి పడిన కొందరు ఉద్యోగులు - అప్పటి ప్రభుత్వ నేతల ఆదేశాల మేరకు వ్యవహరించి సంస్థను నష్టాల్లోకి నెట్టారు.. చివరకు కరోనా సమయంలో మాస్క్‌ల వ్యవహారంలో కూడా కక్కుర్తి పడిన సంఘటనలు కూడా ఉన్నాయి.. దీంతో.. ఆప్కోను నమ్ముకున్న నేతన్నలు అప్పుల పాలయ్యారు.. దీంతో కొందరు చేనేతవృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాలను చూసుకున్నారు.. వేలాది సొసైటీలు ప్రస్తుతం సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.. వీటికి కూడా గత ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక కోట్లాది రూపాయల విలువైన సరకులు సొసైటీల వద్దే మూలుగుతున్నాయి. కొనుగోలు చేసిన వాటికీ బిల్లులు వెంటనే ఇవ్వకపోవడంతో నేతన్నలు బయట చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆప్కోగా పిలిచే ఈ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నేత వస్త్రాల విలువ తెలిసిన పొరుగు రాష్ట్రాలలో కూడా విపరీతమైన ఆదరణ ఉండేది.. ఆప్కో సంస్థను 1976 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.. 1350 చేనేత సహకార సంఘాల నుంచి నేతన్నలు నేచిన వస్త్రాలను కొనుగోలు చేసి.. షోరూమ్‌ల ద్వారా అమ్మకాలు చేసేవారు.. గతంలో 376 షోరూమ్‌లలో ఈ వస్త్రాలను ఆప్కో విక్రయించేది.. ధర్మవరం, మదనపల్లె, శ్రీకాళహస్తి, వెంకటగిరి, ఎమ్మిగనూరు, చీరాల, ఉప్పాడ, మంగళగిరి, పెడన, రాజమండ్రి, పొందూరు తెలుగుజాతి ఔన్నత్యానికి ప్రతీకలుగా నిలిచాయి.. అలాంటి ప్రాంతాల్లోని చేనేత కార్మికులు, కళాకారులను గౌరవిస్తూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలను స్వయంగా తాను ధరించడంతో పాటు ఆ రంగానికి జవజీవాలు నింపారు.. అనంతంర చంద్రబాబు ప్రభుత్వం కూడా పలు పథకాలు కొనసాగించి.. మార్కెటింగ్ సదుపాయాలు కల్పించింది.. ఆప్కోను బలోపేతం చేసి రిబేట్ అమలు చేసింది. సహకార సంఘాల్లో కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంది.. అయితే.. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి వాటన్నింటినీ రద్దు చేసేశారు.. చేనేత అనుబంధ రంగాల్లో మూడున్నర లక్షల మందికి పైగా పనిచేస్తుంటే కేవలం 81వేల మందికే నేతన్న నేస్తం వర్తింపజేసి సరిపెట్టారు..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019- 2024 మధ్య ఆప్కో అవినీతి నిలయంగా మారింది.. చివరకు కరోనా మాస్కుల్లో కూడా కక్కుర్తి పడ్డారు.. 2020-21 సంవత్సరంలో కరోనాతో అల్లాడుతున్న ప్రజల కోసం ఆప్కో ద్వారా మాస్క్‌ల పంపిణీకి ప్రభుత్వం అనుమతించింది.. చేనేత సొసైటీ కార్మికులు నేసిన క్లాత్ కొనుగోలు చేసినట్లు, వాటిని మాస్క్‌లు కుట్టించి ప్రజలకు అందించినట్లు కాగితాల్లో లెక్కలు చూపించారు. కొన్ని ప్రాంతాలలో అరకొరగా పవర్‌లూమ్ క్లాత్‌తో కుట్టించిన మాస్క్‌లు సప్లై చేసి, కోట్ల రూపాయలు స్వాహా చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మాస్క్‌ను తయారు చేయాలంటే 12రూపాయల వరకు పడుతుందని తేలింది. కానీ 31రూపాయలకు ప్రభుత్వానికి అమ్మినట్లు చూపించి నిధులు స్వాహా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. చివరకు 2024 ఎన్నికలకు ముందు కూడా తెలంగాణలో తయారైన దుప్పట్లు, టవల్స్, బెడ్ షీట్ల వంటి 20కోట్ల రూపాయల వస్త్రాలను కొనుగోలు చేసి.. ఆప్కోను దెబ్బ తీశారన్న విమర్శలు ఉన్నాయి.. ఈ కొనుగోళ్లలో 30శాతం నిధులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి.. ఆప్కో వస్త్రాలను యాభై శాతం డిస్కౌంట్‌తో షోరూమ్ ద్వారా అమ్మినట్లు రికార్డులు చూపించి.. అవే వస్త్రాలు మళ్లీ ప్రొక్యూర్‌మెంట్‌తో నూరు శాతం మొత్తంతో కొనుగోలు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.. దీంతో పాటు మంగళగిరి, విజయనగరం, కర్నూలు, విశాఖ గోడౌన్లలోని వస్త్ర నిల్వలపై విచారణ జరపాలని చేనేత సంఘాల నేతల డిమాండ్ చేస్తున్నారు..
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డుకు పచ్చజెండా
ఆ జిల్లాలో పట్టు కోల్పోతున్న వైసీపీ..!
తెలంగాణలో డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News