Share News

AP HighCourt: జనసేన నేత కిరణ్ రాయల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Jan 02 , 2024 | 04:41 PM

Andhrapradesh: తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మొబైల్ ఫోన్ తీసుకుని పోలీసులు బెదిరించడంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. మంగళవారం కిరణ రాయల్ వేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తన మొబైల్ ఫోన్ డాటాను మార్ఫింగ్ చేసి విడుదల చేస్తామని బెదిరిస్తున్నారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. మంత్రి రోజా, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే డాటా విడుదల చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని పిటీషన్‌లో తెలిపారు.

AP HighCourt: జనసేన నేత కిరణ్ రాయల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

అమరావతి, జనవరి 2: తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ (Janasena Leader Kiran Rayal) మొబైల్ ఫోన్ తీసుకుని పోలీసులు బెదిరించడంపై హైకోర్టులో (AP HighCourt) పిటీషన్ దాఖలైంది. మంగళవారం కిరణ రాయల్ వేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తన మొబైల్ ఫోన్ డాటాను మార్ఫింగ్ చేసి విడుదల చేస్తామని బెదిరిస్తున్నారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. మంత్రి రోజా, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే డాటా విడుదల చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని పిటీషన్‌లో తెలిపారు.

పిటీషన్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని కింద కోర్టు గుర్తించిందని న్యాయవాది తెలిపారు. వాదనలు పరిగణనలోకి తీసుకుని హైకోర్టుల ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ సెక్రెటరీ, హోమ్ శాఖ సెక్రటరీ, డీజీపీ, నగరి ఇన్స్పెక్టర్, అప్పటి డీఎస్పీలకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టుల జనవరి 9కి వాయిదా వేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2024 | 04:46 PM