Share News

Vijayawada: దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తు్న్న అమ్మవారు..

ABN , Publish Date - Oct 10 , 2024 | 08:13 AM

దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కాగా దుర్గమును దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చారు. దుర్ఘతలను పోగొట్టే దుర్గాదేవిని దర్శించుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Vijayawada: దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తు్న్న అమ్మవారు..

విజయవాడ: ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Dussehra Sharannavaratri Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవరోజు గురువారం అమ్మవారు దుర్గాదేవి (Durga Devi) అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కాగా దుర్గమును దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చారు. దుర్ఘతలను పోగొట్టే దుర్గాదేవిని దర్శించుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


కాగా ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మూలానక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) కావడంతో రాష్ట్ర నలుమూలల భారీగా తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్ని క్యూలనూ ఉచితంగా వదిలేశారు. సామాన్య భక్తులతోపాటు, వీఐపీల తాకిడి ఎక్కువవ్వడంతో కొండ కిటకిటలాడింది. అమ్మవారు బుధవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి సుమారు 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గగుడి అధికారుల అంచనా. సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్‌ దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూలా నక్షత్రం నాడు ఎలాంటి వివాదాలు, ఆటంకాలు లేకుండా భక్తులు దుర్గమ్మను సరస్వతీ అలంకారంలో దర్శించుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక, పోలీసు, రెవెన్యూ, దేవదాయశాఖల మధ్య సమన్వయం కారణంగా సామాన్య భక్తులు సైతం తమకు అసౌకర్యం కలిగిందని ఎక్కడా ఫిర్యాదులు రాకపోవడం విశేషం. మూలానక్షత్రంనాడు అన్ని టిక్కెట్‌ దర్శనాలను ఉచితం చేశారు. లక్షల్లో అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు రూపొందించటంలో.. క్యూలైన్ల క్రమబద్ధీకరణలో అన్ని శాఖలు విజయం సాధించాయి.


అర్ధరాత్రి నుంచే భారీగా భక్తులు..

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అర్ధరాత్రి నుంచే భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అసాధారణంగా దర్శనాలు జరిగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా వ్యవస్థలన్నీ ఏమాత్రం ఏమరపాటుగా లేకుండా వ్యవహరించడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. కార్పొరేషన్‌ దగ్గర నుంచి కంటెయినింగ్‌ జోన్లను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో భక్తులను ఈ ప్రాంతంలో హోల్డింగ్‌ చేశారు. ఆ తర్వాత క్యూలైన్లలోకి పంపారు. క్యూలలో తొక్కిసలాటను నివారించటానికి వీలుగా రోపులతో నిర్ణీత దూరం వరకు భక్తులను హోల్డ్‌ చేశారు. ఇలా రోజంతా హోల్డ్‌ చేయటం వల్ల ఎక్కడా తొక్కిసలాటకు అవకాశం ఇవ్వలేదు. మూలా నక్షత్రం రోజున గతంలో అమ్మవారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ ఏడాది అనధికార దర్శనాలను పూర్తిగా నియంత్రించటంవల్ల కేవలం గంటన్నర వ్యవధిలోనే భక్తులు అమ్మ దర్శనం చేసుకున్నారు. క్యూలలో ఎలాంటి అసౌకర్యాలు కలగలేదు. భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా మంచినీళ్ల ప్యాకెట్లను సిద్ధం చేశారు. లడ్డూ ప్రసాదాలను ముందస్తుగా సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల ఎలాంటి కొరతా ఏర్పడలేదు. ఈసారి రూ. 100కి ఆరు లడ్డూల ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకురావటంతో వీటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. కొండ దిగువన భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి వీలుగా ఏర్పాట్లు ఉండటంతో స్వేచ్ఛగా పూర్తి చేసుకున్నారు. మూలా నక్షత్రం రోజున ఎలాంటి సమస్యలు లేకపోవడంతో దేవస్థాన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి తోడు వాతావరణం మేఘావృతంగా ఉండటంతో పాటు తుంపర చినుకులు పడటం వల్ల కూడా భక్తులు చల్లటి వాతావరణంలో దుర్గమ్మ దర్శనం చేసుకోగలిగారు. ఉదయం రెండు గంటల పాటు విపరీతమైన ఎండ వేసినా ఆ తర్వాత ఒక్కసారిగా నగరం మేఘావృతమైంది. ఓ భక్తురాలిపై పోలీసు అధికారి చేయిచేసుకోవటం తప్పితే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. అనధికారిక దర్శనాలను పూర్తిగా నిలువరించగలిగారు. దేవస్థాన సిబ్బంది కొంతమేర అనధికార దర్శనాలు చేయించే ప్రయత్నం చేసినా.. చాలావరకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం వాటిని సమర్ధవంతంగా అడ్డుకోగలిగింది. దీంతో దసరా ఉత్సవాలు మూలా నక్షత్రం రోజున ప్రశాంతంగా జరిగాయి. ఘాట్‌ మార్గాలు, కొండ దిగువన కార్పొరేషన్‌ పారిశుధ్య సిబ్బంది సేవలు అందించారు. గతంలో మాదిరిగా చెప్పుల కుప్పలు కనిపించలేదు. దసరా ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంది. ఈ ఫీడ్‌బ్యాక్‌లో భక్తులు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చారు. సౌకర్యాలకు సంబంధించి మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించటానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫీడ్‌ బ్యాక్‌ వివరాలను ప్రకటించి చాలా సంతృప్తిగా ఉందని చెప్పారు. మూలానక్షత్రం రోజున భక్తుల ఫీడ్‌ బ్యాక్‌ చూస్తే క్యూలైన్ల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగితే 85 శాతం మేర సంతృప్తిగా ఉందని భక్తులు సమాధానం ఇచ్చారు. ఆలయ అలంకరణ ఏర్పాట్లకు సంబంధించి 92 శాతం ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. పారిశుధ్యానికి సంబంధించి 87 శాతం, మంచినీటి బాటిళ్లు - వాటర్‌ ప్యాకెట్ల పంపిణీకి సంబంధించి 95 శాతం, ఉభయదాతల పూజలకు సంబంధించి 94 శాతం, వృధ్ధులు - వికలాంగుల సేవలకు సంబంధించి 94 శాతం లడ్డూ ప్రసాదాలకు సంబంధించి 93 శాతం, కేశఖండన సేవలకు సంబంధించి అత్యధికంగా 96 శాతం మేర భక్తులు ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొప్ప మానవతావాదిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు

దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది: సీఎం రేవంత్ రెడ్డి

వ్యాపారాల్లో సూపర్ మ్యాన్.. లవ్‌లో ఫెయిల్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 10 , 2024 | 08:13 AM