Kesineni Nani: అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.
ABN , Publish Date - Jan 06 , 2024 | 11:40 AM
చందర్లపాడు మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.
విజయవాడ: చందర్లపాడు మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. లోక్‌సభ స్పీకర్ అనుమతి కోరానని.. స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానన్నారు.
ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కేశినేని నాని అన్నారు. ఆపై మా వాళ్ళు ఏం చెయ్యమంటే అదే చేస్తానన్నారు. ఇందులో తన సొంత నిర్ణయం ఉండదని కేశినేని నాని తెలిపారు. తాను ఏం చేసినా పారదర్శకంగా చేస్తానన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా తెల్లవారు జామున పోస్ట్‌లో పెడుతున్నానన్నారు. దాన్ని మీడియా ఫాలో అవ్వటమేనని.. రోజూ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనన్నారు. ఇక్కడ ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేశానన్నారు. ప్రజలను, తనతో ఉన్న వాళ్ళను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేనని కేశినేని నాని తెలిపారు.