Share News

Perninani Case: బియ్యం మాయం కేసులో పోలీసుల దూకుడు

ABN , Publish Date - Dec 30 , 2024 | 10:55 AM

Andhrapradesh: పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం అయ్యాయని ఇటీవల పోలీసులకు కోటి రెడ్డి ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వలు మాయంపై తనపై అనుమానం రాకుండా పోలీసులకు కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మానస తేజ, కోటి రెడ్డి అరెస్ట్‌లను పోలీసులు నేడు నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది.

Perninani Case: బియ్యం మాయం కేసులో పోలీసుల దూకుడు
Perni Nani godown case

కృష్ణా, డిసెంబర్ 30: మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో (Perninani godown) బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో జిల్లా సివిల్ సప్లయ్ శాఖ కృష్ణా జిల్లా మేనేజర్ కోటి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నిన్న (ఆదివారం) గోడౌన్ మేనేజర్ మానస తేజను అరెస్ట్ చేశారు. కోటి రెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం అయ్యాయని ఇటీవల పోలీసులకు కోటి రెడ్డి ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వలు మాయంపై తనపై అనుమానం రాకుండా పోలీసులకు కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మానస తేజ, కోటి రెడ్డి అరెస్ట్‌లను పోలీసులు నేడు నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ ‌పిటిషన్‌పై విచారణకు రానుంది. ఇదే కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధ కాకుండా మరో ఇద్దరిపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


కాగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బియ్యం కుంభకోణానికి సంబంధించి పేర్నినాని చుట్టూ వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా నాని సతీమణి పేర్ని జయసుధ పేరును చేర్చారు. అదేవిధంగా నిన్న గోడౌన్ మేనేజర్ మానసతేజను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 20 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న గోడౌన్ మేనేజర్ మానసతేజను నిన్న హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మానస తేజ కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించగా.. చివరకు హైదరాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకుని మచిలీపట్నంకు తరలించి రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మేనేజర్‌కు సంబంధించి బ్యాంకు ఖాతా లావాదేవీలకు సంబంధించిన లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే మానసతేజ అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు పేర్ని నానికి సంబంధించిన గోడౌన్‌ను ప్రభుత్వం అద్దెకు తీసుకున్న నాటి నుంచి పౌరసరఫరాలశాఖలో పనిచేసిన అధికారులకు పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు మానసతేజ అరెస్ట్ విషయం తెలుసుకున్న పేర్నినాని.. రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు, మంత్రి కొల్లు రవీంద్రపై చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Year Ender 2024: కాళేశ్వరం చుట్టూ ఈ ఏడాది రాజకీయం


నెల రోజుల పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి విజలెన్స్ పోలీసు అధికారులు దాదాపు 7వేలకు పైగా బస్తాలు మాయం అయినట్లు నిర్దారించారు. దీనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మానస తేజతో పాటు సివిల్ సప్లై మేనేజర్ కోటి రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బియ్యం మాయంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విచారణ పూర్తి అయిన తర్వాత నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది.


అలాగే పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో ఈ నెల 10న గోడౌన్‌ యజమానిగా ఉన్న పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జయసుధ అజ్ఞాతంలో ఉండిపోయారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును జయసుధ ఆశ్రయించారు. అయితే బెయిల్ పిటిషన్‌పై విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈరోజు మరోసారి కోర్టు బెయిల్‌పై విచారణ జరుగనుంది. దీంతో జయసుధ ముందస్తు బెయిల్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అనే ఉత్కంఠ నెలకొంది. బెయిల్‌పై క్లారిటీ వచ్చాకే జయసుధ అజ్ఞాతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

మళ్లీ నిరాశపరిచిన సీనియర్లు.. ఇబ్బందుల్లో టీమిండియా

కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 11:13 AM