Andhra Pradesh: ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:41 PM
విజయవాడ, జనవరి 18: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను నిరపరాధి అని అతని తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు వాదిస్తున్నారు. తన కొడుక్కి న్యాయం చేయాలంటూ ఆమరణదీక్షకు దిగారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహా దీక్ష చేపట్టారు శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు.
విజయవాడ, జనవరి 18: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను నిరపరాధి అని అతని తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు వాదిస్తున్నారు. తన కొడుక్కి న్యాయం చేయాలంటూ ఆమరణదీక్షకు దిగారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహా దీక్ష చేపట్టారు శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు. పబ్లిక్ ప్లేస్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. వారిద్దరూ ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు. తన కొడుక్కి న్యాయం జరిగే వరకు.. తన ప్రాణాలు పోయినా లెక్క చేయనని అన్నారు శ్రీను తల్లి సావిత్రి. న్యాయం కోసమే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
విజయవాడ ధర్నా చౌక్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు జనవరి 12వ తేదీన పోలీసుల అనుమతి కోరుతూ విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసులు ఆమె దీక్షకు అనుమతి ఇవ్వలేదు. దాంతో.. ఇంట్లోనే దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించింది శ్రీను తల్లి సావిత్రి. ప్రాణం ఉన్న అంబేద్కర్ వారసుడిని జైల్లో నిర్బంధించి.. ప్రాణం లేని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించడం దళితులకు చేస్తున్న ద్రోహం అని వ్యాఖ్యానించారు కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, గుణదల మేరీమాత తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సుబ్బరాజు. దళిత, మైనారిటీ ప్రజా సంఘాలు తమకు మద్దతివ్వాలని వేడుకున్నాడు సుబ్బరాజు.