Share News

AP Govt: ఇకపై ఆ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. సర్కార్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:03 PM

Andhrapradesh: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం అమలుకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది.

AP Govt: ఇకపై ఆ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. సర్కార్ కీలక నిర్ణయం
AP Government

అమరావతి, డిసెంబర్ 31: ఏపీ ప్రభుత్వం (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం అమలుకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 40ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ (School Education Secretary Kona Shashidhar) జారీ చేశారు. దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు కారణంగా ఉన్నత విద్యకు ఈ విద్యార్థులు దూరం కాకుండా చూడడంలో భాగంగా మథ్యహ్న భోజన పథకాన్ని సర్కార్ అమలులోకి తీసుకొచ్చింది. మధ్యహ్న భోజన పథకం ద్వారా విద్యార్థికి పౌష్టికాహరం అందడంతో పాటు ఆరోగ్యం, అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందని సర్కార్ భావించింది.


ఈ పథకం ద్వారా పౌష్టికాహరం అందడం, హాజరు శాతం పెరగడంతో పాటు సామాజిక సమైఖ్యత పెరగడం ఏర్పడడం, పేద కుటుంబాలకు ఆర్ధికంగా వెసులుబాటు సాధ్యమవుతుంది. విద్యార్థి దశ నుంచే మంచి ఆహారపు అలవాట్లు కూడా అలవడే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా విద్యార్థి సంక్షేమంతో పాటు విద్యా, సామాజిక పరమైన లక్షాల సాధన జరుగుతుంది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి 1 నుంచి మధ్యహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పేర్ని నానిపై కేసు.. అరెస్టు ఎప్పుడంటే..


ఈ పథకం కోసం రూ. 29. 39 కోట్లు బడ్జెట్ కేటాయించింది సర్కార్. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి మరో రూ. 85.84కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ పథకం అమలుకు ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్, మధ్యహ్న భోజన కార్యక్రమం డైరెక్టర్‌లు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఉత్తర్వులతో పాటు మిడ్ డే మీల్ గైడ్ లైన్స్‌ను కూడా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.


ఇవి కూడా చదవండి...

ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో జనవరి ఫూల్స్ అవుతారు..

బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు: యువ ఉద్యోగి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 02:35 PM