Rain Alert: వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ
ABN , Publish Date - Sep 10 , 2024 | 07:07 AM
విజయవాడ: ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న - నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ వరద నీరు ఉంది.
విజయవాడ: ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు (Assistive measures) చేపట్టారు. రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న - నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ వరద నీరు ఉంది. 61, 62, 63, 64 డివిజన్లలో వరద నీటిని బయటకు పంపేందుకు ఉన్న అన్ని మార్గాలపై అర్థరాత్రి మంత్రి అధికారులతో చర్చలు జరిపారు. వెంటనే 10 జేసీబీలు రప్పించి రోడ్డును తవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డును మూడు చోట్ల తవ్వడం ద్వారా వరద నీరు బయటకు పంపేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీరు ఇప్పటికీ నిల్వ ఉందన్నారు. ఖండ్రిక చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశామని,10 జేసీబీల ద్వారా రోడ్లకు గండి పెట్టి నీటిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక్కడ నీరు బయటికి వెళ్తే నగరంలో ఉన్న వరద నీరు మొత్తం తగ్గిపోతుందన్నారు. మంగళవారం సాయంత్రానికల్లా మొత్తం నీరు తగ్గిపోయేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
మరోవైపు వరద బాధితుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసిందని మంత్రి నారాయణ తెలిపారు. వరద బాధితులకు నిత్యావసరాలతో కూడిన ఆహార కిట్లు అందిస్తున్నామని, లక్షల కొద్దీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు ఆహార ప్యాకెట్లలో పెట్టినట్లు తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌లో 6 ఆపిల్స్, 6 బిస్కట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉంటాయని, వాటిని ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబానికీ అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. వాటితోపాటు నిత్యావసరాల సరకుల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
కాగా పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పొంగూరు నారాయణ సోమవారం పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. శానిటేషన్‌లో భాగంగా డ్రైనేజీపై బ్లీచింగ్ చల్లారు. చాలా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. మళ్లీ తిరిగి వర్షం రావడంతో కొంత పనులకు అంతరాయం కలిగిందని,. డ్రైనేజ్ పనులపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. నీరు నిల్వ ఉన్నప్పటికీ చెత్తను తొలగించకుంటే అంటు వ్యాధులు వస్తాయని, అందుకే నీటిలో ఉన్న చెత్తను తొలగిస్తున్నామని అన్నారు. వైద్యారోగ్య శాఖతో కలిసి హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టుకు రావడానికి జగన్‌కు నామోషీ!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News