Vijayawada: వరద నీటి పంపింగ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ..
ABN , Publish Date - Sep 13 , 2024 | 07:29 AM
విజయవాడ: నగరంలో పలు చోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్‌లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64 వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్‌తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
విజయవాడ: నగరంలో పలు చోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను (Flood water pumping works) మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) పరిశీలించారు. కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్‌లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64 వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్‌తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ., వరద నీరు బయటకు పంపింగ్ చేసేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేశామని, కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం సాయంత్రానికి నగరంలో ఎక్కడా వరద నీరు లేకుండా పంపింగ్ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. బుడ మేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా తాత్కాలిక చర్యలు మొదలు పెట్టామని, రూరల్ ప్రాంతాల్లో ఇంకా కొన్ని చోట్ల వరద నీరు ఉందన్నారు. రెండు రోజుల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
కాగా బంగ్లాదేశ్ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 15వ తేదీకల్లా బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గురువారం రాష్ట్రంలో అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజు రోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది. బుధవారం రాత్రికి పైకికనిపిస్తున్న రెండు బోట్లలో ఒక బోటునైనా ముక్కలు చేయాలని సీ లయన్ కంపెనీ, బెకమ్ కంపెనీ ఇంజనీర్లు భావించారు. కానీ ఇది సాధ్యం కాలేదు. నీళ్లలో బోటు కటింగ్‌కు ఎక్కువ సమయం పడుతోంది. గురువారం ఉదయం బోటు పైభాగాన్ని కట్ చేశారు. ఈ బోట్ల తయారీకి బాగా మందపాటి ఇనుప రేకును ఉపయోగించారు. 9 మీటర్ల మేర రెండు వరుసల్లో కలిపి 18 మీటర్ల రేకును కట్ చేయాలి. నీటిలో మునిగిఉన్న వైపు భాగాన్ని కూడా కలుపుకుంటే మరింత ఎక్కువే కట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పైకి కనిపిస్తున్న భాగం కటింగ్ పూర్తయింది.
నీళ్లలో మునిగి ఉన్న భాగాన్ని కట్ చేయడం కష్టంగామారింది. డైవర్లు నీటిలో గంటసేపు మాత్రమే ఉండగలుగుతున్నారు. ప్రస్తుతం అడుగు నుంచి కటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కో బోటును రెండు ముక్కలు చేయాలన్న నిర్ణయానికి ఇంజనీర్లు వచ్చారు. ఇటు ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి, అటు నదికి ఒడ్డున ఉన్న మోడల్ గెస్ట్‌హౌస్ వైపు నుంచి ఐరన్ రోప్‌లు ఏర్పాటు చేసి ఆ రెండు ముక్కలు వేరు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం కాకినాడ నుంచి పదిమందితో కూడిన రిగ్గింగ్ టీమ్ విజయవాడకు చేరుకున్నారు.
పాపికొండల్లో కచ్చులూరు వద్ద బోటు నీటమునిగినప్పుడు కీలకంగా పనిచేసిన అబ్బులు టీం ఇక్కడకు చేరుకుంది. నీళ్లలోని బోట్లను లాగడంలో ఈ బృందానికి మంచి నైపుణ్యం ఉంది. మోడల్ గెస్ట్ వద్ద గల ఘాట్‌పై భారీ రోప్‌ను ఏర్పాటు చేసి ముక్కలైన బోటు భాగాన్ని లాగుతారు. ఈ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం మొదలవుతుందని భావిస్తున్నారు. ఒక్క బోటు కటింగ్‌కు రెండు రోజుల సమయం పట్టింది. బ్యారేజీ వద్ద మొత్తం మూడు బోట్లు ఉన్నందు వారం రోజుల వరకు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. నీళ్లలో మునిగి ఉన్న భాగాన్ని కట్ చేయడం కష్టంగామారింది. డైవర్లు నీటిలో గంటసేపు మాత్రమే ఉండగలుగుతున్నారు. ప్రస్తుతం అడుగు నుంచి కటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కో బోటును రెండు ముక్కలు చేయాలన్న నిర్ణయానికి ఇంజనీర్లు వచ్చారు. ఇటు ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి, అటు నదికి ఒడ్డున ఉన్న మోడల్ గెస్ట్‌హౌస్ వైపు నుంచి ఐరన్ రోప్‌లు ఏర్పాటు చేసి ఆ రెండు ముక్కలు వేరు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం కాకినాడ నుంచి పదిమందితో కూడిన రిగ్గింగ్ టీమ్ విజయవాడకు చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News