Share News

Narayana: అనుకున్న ప్రకారమే రాజధాని పూర్తి.. తగ్గేదేలే అన్న మంత్రి

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:19 PM

Andhrapradesh: నిరుపేదలకు మంచి ఇళ్లు కట్టాలని, ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారని మంత్రి నారాయణ అన్నారు. దీనికోసం అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టు‌ను సీఎంకు ఇచ్చామని.. ఆయన కట్టమని అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చారన్నారు. 7 లక్షల 1 వెయ్యి 481 ఇళ్లు కేంద్రం ఇవ్వగా వాటిలో 5 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతి ఇచ్చామని..

Narayana:  అనుకున్న ప్రకారమే రాజధాని పూర్తి.. తగ్గేదేలే అన్న మంత్రి
Minister Narayana

అమరావతి, డిసెంబర్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నేతృత్వంలో 44 వ సిఆర్డీఏ అధారిటీ సమావేశం ఈరోజు (సోమవారం) జరిగిందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. జోన్ 7, జోన్ 10 లేఅవుట్‌ల కోసం రూ. 2723 కోట్లకు అధారిటీ అంగీకారం తెలిపిందన్నారు. నేటితో రూ.47,288 కోట్లకు అథారిటీ అమారావతిలో అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన వర్క్స్‌‌కు త్వరలోనే ఆమోదం ఇస్తామన్నారు. వర్క్స్‌కు సంబంధించి వరుసగా టెండర్లు పిలిచి కంప్లీట్ చేస్తామన్నారు. నిరుపేదలకు మంచి ఇళ్లు కట్టాలని, ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారన్నారు. దీనికోసం అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టు‌ను సీఎంకు ఇచ్చామని.. ఆయన కట్టమని అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చారన్నారు. 7 లక్షల 1 వెయ్యి 481 ఇళ్లు కేంద్రం ఇవ్వగా వాటిలో 5 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతి ఇచ్చామని.. వాటిలో 4లక్షల 54వేలు 706 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయన్నారు.

అల్లు అర్జున్ బెయిల్ రద్దు..!


కేంద్రం రిక్వెస్ట్‌తో...

2019 నాటికి 3 లక్షల 13వేల 832 ఇళ్ళు స్టార్ట్ అయ్యాయని.. మిగిలినవి ల్యాండ్ డిస్పూట్‌ల కారణంగా ఆగాయని వెల్లడించారు. దీనిలో మూడు రకాలుగా 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల్లో ఇళ్లు కట్టాలని నిర్ణయించామన్నారు. అయితే కేంద్రం రిక్వెస్ట్ చేయడంతో కేంద్రం, రాష్ట్రాలు 1.5 చొప్పున 3 లక్షలు ఇచ్చాయని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి మౌళిక సదుపాయాలకు రూ. 90 వేలు ఇచ్చారని తెలిపారు. మొత్తంగా 3 లక్షల 90 వేలు కేంద్రం, రాష్ట్రం ఇచ్చేలా చూశామన్నారు. దానిపైన ఎంత పడినా లబ్దిదారులు కట్టేలా చూశామన్నారు. దానిపైన 300 చదరపు అడుగులు ఉన్న ఇళ్లకు 3 లక్షలు బ్యాంకులోను ఇప్పించామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ విధానాన్ని గందరగోళం చేసేసిందని విమర్శించారు.


అన్నీ టీడీపీ హాయాంలో పూర్తైనవే..

ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తికి రూ.7517 కోట్ల అవసరం అవుతాయన్నారు. టెండర్లు పిలిచిన 4 లక్షల 54 వేల ఇళ్లలో అప్పుడు 2 లక్షల 61 వేల 640 ఇళ్లు మాత్రమే ఉంచారన్నారు. 7 లక్షల ఇళ్ల కోసం 38 వేల 265 కోట్లతో చేయాలనుకుంటే వాటిని గత ప్రభుత్వం కట్ చేసిందని మండిపడ్డారు. ఈ రెండు లక్షల 61 వేలు కూడా పూర్తిచేయలేదని... దీనిలో 70 వేల ఇళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయ్యాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తకి 7 వేల 517 కోట్లు కావాలనపి... అప్పుడే 2 లక్షల 61వేల ఇళ్లు పూర్తవుతాయన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణానికి‌ లోన్ రైజ్ చేసి డబ్బులు డైవర్ట్ చేశారని.. ఇప్పుడు బ్యాంకులు లబ్దిదారులను లోన్ కట్టాలి అని అడుగుతున్నారన్నారు. ఇప్పుడు 102 కోట్లు కడితే ఎన్‌పీఏ నుంచి వారు బయట పడతారని తెలిపారు.


ఆ జిల్లాలను అభివృద్ధికి ప్రణాళికలు..

ముందు రూ.102 కోట్లు కట్టి వర్కును టేకప్ చేసి జూన్ 12 లోపల పూర్తిచేయాలని సీఎం ఈరోజు ఆదేశాలు ఇచ్చారన్నారు. లక్షా 18 వేల ఇళ్లు జూన్ 12లోగా పూర్తి చేయాలన్నారన్నారు. ఆ డైరెక్షన్‌లో రాష్ట్రంలో టిడ్కో విషయంలో ముందుకు వెళతామన్నారు. సీఎం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ప్రతి దేశానికి రాజధాని అవసరం అందులో భాగంగానే రాజధానిగా అమరావతిని నిర్ణయించామని తెలిపారు. ఈరోజు లోన్‌లు తీసుకుంటున్నామని.. వాటిని అమరావతి ల్యాండ్స్ అమ్మటం ద్వారా కడతామని చెప్పారు. ప్రజల మీద ఒక్క పైసా భారం లేకుండా అమరావతిని కడతామని స్పష్టం చేశారు.


వారిది చెత్త పత్రిక..

గిరిజన యూనివర్సిటీ విజయనగరం, ఐఐఎం విశాఖకు, నిట్ తాడేపల్లిగూడెం, ఎయిమ్స్ మంగళగిరి ఇలా అనేక సంస్ధలను వేర్వేరు ప్రాంతాలు, నగరాల్లో పెట్టామన్నారు. టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలను వైజాగ్ తీసుకువచ్చామని.. లూలూను తిరిగి విశాఖకు తెచ్చామని తెలిపారు. డ్రోన్ హబ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోర్టుల సమీపంలో ఒక శాటిలైట్ సిటీని అమరావతి మాడల్‌లో నిర్మించాలని సీఎం సూచించారన్నారు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదని మండిపడ్డారు. వారి పత్రిక చెత్త పత్రిక అని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని అన్నారు. చెప్పింది చెప్పినట్టు చేయాలని చూస్తుంటే వారు కావాలని అన్ని ఇక్కడే పెడుతున్నారంటూ ప్రచారం ప్రారంభించారన్నారు. అన్నిజిల్లాలు అభివృద్ధే ఈ ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. వరల్డ్ బ్యాంకు వారికి లోన్లు ఇవ్వద్దని వైసీపీ ప్రభుత్వమే లేఖలు రాసిందని ఆరోపించారు. బుడమేరు అంత ప్లడ్ వచ్చినా, చరిత్రలో లేని వరద వచ్చినా అమరావతికి ఇబ్బంది లేదని తేలిపోయిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..

ఈ రాశి వారు సన్నిహితుల నుంచే సమస్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 03:56 PM