Muappalla: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి.. కూటమి ప్రభుత్వానికి ముప్పాళ్ల వినతి
ABN , Publish Date - Oct 21 , 2024 | 04:00 PM
Andhrapradesh: అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతున్నారన్నారు. దశాబ్ద కాలంగా బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 21: అగ్రిగోల్డ్ బాధితులను (Agrigold Victims) ఆదుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు (Agrigold Victims Association President Muppalla Nageswara Rao) కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతున్నారన్నారు. దశాబ్ద కాలంగా బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు.
Kadiyam Srihari: బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన కడియం
గత ప్రభుత్వం రూ.906 కోట్లు ఇచ్చి మమ అనిపించి... మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బాధితులను మోసం చేసింది కాబట్టే ఓడిపోయిందన్నారు. పిలవని పేరంటానికి అన్నట్లుగా జగన్ వచ్చి ఆనాడు నేను ఆదుకుంటానని, ఆరు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారని.. ఐదేళ్లు పాలన సాగించిన జగన్.. అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఆలకించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం అర్జీ తీసుకునేందుకు కూడా జగన్ సమయం ఇవ్వలేదన్నారు.
కూటమి నేతలు ఇచ్చిన హామీలను నమ్మి 36 లక్షల మంది బాధితులు ఓట్లు వేశారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి బాధితులను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చామన్నారు. ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, సమర్ధ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేసుకుంటున్నారని.. వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచి ఆస్తులను ఆక్షన్ పెట్టాలని వినతి చేశారు. బాధితులకు ఇవ్వగా, ఇంకా అదనంగా కూడా డబ్బులు వస్తాయని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. ఈనెల 28వ తేదీన ధర్నా చౌక్‌లో బాధితులతో కలిసి మహా విజ్ఞాపన దీక్ష చేపడుతున్నామని ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు.
Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..
ఇదీ విషయం...
కాగా... అగ్రిగోల్డ్ మోసాల వల్ల ఉమ్మడి ఏపీలో దాదాపు 11 వేల మంది డిపాజిటర్లు మునిగిపోయిన విషయం తెలిసిందే. పిల్లల ఉన్నత చదువులు, అమ్మాయి పెళ్లి, పదవీ విరమణ అనంతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు డిపాజిట్లు కట్టారు. వారందరినీ అగ్రిగోల్డ్ సంస్థ ముంచేసింది. డిపాజిటర్లకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ తర్వాత వారికే శఠగోపం పెట్టాలని చూశారు. వారికి ఉన్న చట్ట రక్షణలను తొలగించాలని కుట్ర చేశారు. అమ్మి డిపాజిటర్లకు చెల్లింపులు చేయాల్సిన అగ్రిగోల్డ్ ఆస్తులను తాకట్టు పెట్టాలని చూశారు. దీనికోసం ఆర్డినెన్స్‌ను కూడా సిద్ధం చేశారు. అయితే, అప్పటి గవర్నర్ జోక్యంతో జగన్ ఎత్తు చిత్తయింది. 2019 ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తానని జగన్ ఆర్భాటం చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు తాను అధికారంలోకి వస్తే రూ.1100 కోట్లు కేటాయిస్తానని మాటిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట దేవుడెరుగు.. అగ్రిగోల్డ్ ఆస్తులపైనే గురిపెట్టారు. అగ్రిగోల్డ్ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.4500 కోట్లు విలువైన స్థిర, చరాస్థులున్నాయి. వీటిని గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే గత ఐదేళ్లల్లో కేవలం రూ.5వేలు, రూ.10 వేలు కట్టిన డిపాజిటర్లకు మాత్రమే జగన్ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. రూ.10 వేలు పైన కట్టిన డిపాజిటర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మొత్తం అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సింది ఆరువేల కోట్లు కాగా, ప్రభుత్వం రూ.900కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇప్పటికీ రూ.5100 కోట్లు వరకూ డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
AP Ministers: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు.. షెడ్యూల్ ఇదే
Virat Kohli: ఒత్తిడికి దూరంగా విరాట్ కోహ్లీ.. భార్యతో భక్తి కాన్సర్ట్‌కు
Read Latest AP News And Telugu News