Share News

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:57 AM

Andhrapradesh: విజయవాడ - విస్సన్నపేట ప్రధాన రహదారిపై పాత నాగులూరు గ్రామస్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై టెంటు వేసుకుని మరీ గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు సీపీఎం నాయకుల సంఘీభావం తెలిపారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు.

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే
NTR District

ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 27: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇటుక బట్టీల వల్ల తమ ఇళ్లు పాడవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ వారు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వెంటనే ఇటుక బట్టీలను తమ గ్రామం నుంచి తొలగించాలని.. దానికి తగిన చర్యలు తీసుకోవాలి అధికారులకు ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నాగలూరు గ్రామస్తులు ఈ మేరకు నిరసన చేపట్టారు. విజయవాడ - విస్సన్నపేట ప్రధాన రహదారిపై పాత నాగులూరు గ్రామస్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై టెంటు వేసుకుని మరీ గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు సీపీఎం నాయకుల సంఘీభావం తెలిపారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా వారు ధర్నా చేపట్టారు. గ్రామ సమీపంలో ఉన్న ఇటుక బట్టీల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.


ఇటుక బట్టీలలో వాడే బూడిద గాలికి తమ ఇళ్లలోకి వచ్చి పడటంతో ఇళ్ళు అన్నీ నాశనం అవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇటుక బట్టీల నుంచి వచ్చే బూడిద ఆ మార్గంలో వచ్చే వాహనదారుల కళ్లలో పడటంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. అసలు రోడ్డుపై వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇటుక బట్టీల నుంచి వచ్చే కాలుష్యంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఇటుకల తయారీ కోసం గ్రామంలోని చెరువులో నుంచి అక్రమంగా మట్టిన తీసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపణలు గుప్పించారు. గ్రామ సమీపంలో ఉన్న ఇటుక బట్టీలు తీసి వేయాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు.


అధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకు రోడ్డుపైనే ఆందోళన చేస్తామని పాత నాగులూరు గ్రామస్తులు స్పష్టం చేశారు. పాత నాగులూరు ప్రజల ఆందోళనతో విస్సన్న పేట - విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటుక బట్టీలపై అధికారులతో మాట్లాడుతామని.. ప్రస్తుతం ఆందోళన విరిమించాలని పోలీసులు కోరారు. అయితే అందుకు ఆందోళనకారులు ససేమిరా అంటున్నారు. ఇటుక బట్టీలను తొలగించే వరకు తమ ఆందోళనను విరమించేంది లేదని స్పష్టం చేశారు. ఇటుక బట్టీల విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని పాత నాగులూరు గ్రామస్తులు పట్టుబడుతున్నారు. మరి గ్రామస్తుల ఆందోళనలపై అధికారుల నుంచి స్పందన ఎలాంటి ఉండబోతోంది.. ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


ఇవి కూడా చదవండి...

Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం

గుర్తుపెట్టుకోండి.. జనవరి 1 నుంచి మారేవి ఇవే..

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 27 , 2024 | 10:57 AM