Share News

Pawan Kalyan: పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించాం..

ABN , Publish Date - Nov 26 , 2024 | 10:52 AM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని అన్నారు. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని, ఆంధ్రప్రదేశ్‌కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చునని అన్నారు.

Pawan Kalyan: పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించాం..

న్యూఢిల్లీ: దేశ రాధాని ఢిల్లీ (Delhi)లో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) మంగళవారం ఉదయం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్‌తో (Union Minister Gajendra Singh Shekhawat ) సమావేశం అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం పవన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గజేంద్ర సింగ్ అంటే అపారమైన గౌరవం ఉందని, ఆయన జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని అన్నారు. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని, ఆంధ్రప్రదేశ్‌కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని కోరామని.. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్‌ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు. తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో పవన్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో.. సాయంత్రం 3:15 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో.. 4:30కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnav)తో... 5:15కు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్‌ (Lalan Singh)తో.. బుధవారం ఉదయం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)తో పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ రెండో సారి ఢిల్లీకి వచ్చారు. కొద్ది రోజుల కిందట ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)తో సమావేశం అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయనను అమిత్ షా పిలిచినట్లుగా సమాచారం. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వచ్చారు.


కాగా రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, ఏపీని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని చెప్పారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాల తీసుకున్నట్లు వెల్లడించారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో టెంపుల్‌, ఎకో, అడ్వెంచర్‌, హెరిటేజ్‌ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై సహచర మంత్రులు, అధికారులతో పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. కర్నూలు జిల్లా ఆదోని, దొండపాడు, ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం లాంటి ప్రాంతాల్లో విద్యార్థుల కోసం అడ్వెంచర్‌ థీమ్‌ పార్క్స్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎకో టూరిజానికి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాం’’ అన్నారు.

రాష్ట్రంలో అడ్వెంచర్‌ థీమ్‌ పార్కులు

‘‘కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విద్యార్థుల కోసం అడ్వెంచర్‌ థీమ్‌ పార్క్‌లు ఏర్పాటు చేశారు. అలాంటి థీమ్‌ పార్క్‌లు మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. నంద్యాలలో ఏనుగుల క్యాంపులు ఉన్నాయి. గండికోట, హార్స్‌లీహిల్స్‌ల్లో అద్భుతమైన కొండ ప్రాంతాలున్నాయి. సినిమాల ద్వారా పర్యాటక ప్రాంతాలకు సులువుగా ప్రచారం కల్పించవచ్చు. ఒక సినిమాలో ఒక స్పాట్‌ను ప్రమోట్‌ చేస్తే అదే కరపత్రంగా మారుతుంది. కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లినపుడు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తుల ప్రస్తావన తెచ్చారు. వారికి గతంలో ఉండే సౌకర్యాలు ప్రస్తుతం తీసేశారని ఆయన చెప్పారు. సీఎంతో సమావేశం సందర్భంగా అటవీశాఖ అధికారులు మా దృష్టికి తెచ్చిన టూరిజం పోలీసింగ్‌ అంశం కూడా చర్చకు వచ్చింది. మన దగ్గర దేవాలయాలు అంటే పిక్నిక్‌ స్పాట్స్‌లా మారిపోయాయి. ఆలయాల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలి. ఆలయ ప్రాంగణాల్లో క్రమశిక్షణ, డ్రెస్‌కోడ్‌ వంటి వాటిపై అవగాహన కల్పించాలి. హెరిటేజ్‌ ప్రాంతాలను గత పాలకులు తమ స్వార్థానికి తవ్వేశారు. వాటిని గుర్తించి, కాపాడుకోవాలి. ముఖ్యంగా పర్యాటకుల భద్రత చాలా అవసరం’’ అని పవన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఆర్‌ అండ్‌ బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, దేవదాయ శాఖ కమిషన్‌ ఎస్‌.సత్యనారాయణ, పర్యాటక శాఖ సెక్రటరీ వి.వినయ్‌ చంద్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు

శైలజ మృతి పై ఆందోళన..

తొలి రోజే ‘అదానీ’ రచ్చ

ఎనిమిది గంటల పెళ్లి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 26 , 2024 | 12:12 PM