Police Sports: పోలీసు స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌ను ప్రారంభించిన పోలీసు కమిషనర్
ABN , Publish Date - Nov 28 , 2024 | 09:57 AM
ఏపీ పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నా... క్రీడలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని, పోలీసు శాఖలో ఫిజికల్ ఫిటనెస్ ఎంతో అవసరమని అన్నారు. వ్యాయామం, క్రీడలు... పోలీసుల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతాయని, క్రీడలతో మనకు తెలియకుండానే మనసికంగా ధృడత్వాన్ని పొందుతామన్నారు.
విజయవాడ: ఏపీ పోలీసు స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌ను (AP Police Sports, Games Meet) విజయవాడ నగర పోలీసు కమిషనర్ (Police Commissioner) రాజశేఖర్ బాబు (Raja Sekhar Babu) గురువారం ఉదయం ప్రారంభించారు (Inaugurate). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం పని ఒత్తిడితో పోలీసులు బిజీగా ఉంటారని, 2024 లో పోలీసు శాఖ చాలా పని ఒత్తిడికి గురైన మాట వాస్తవమని అన్నారు. ప్రజల్లో పోలీసులపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పని తీరులో మార్పులు చేస్తున్నామన్నారు. ఇప్పుడు సాంకేతికత ఆధారంగా కేసులను చేధిస్తున్నామన్నారు. చాలా కేసులలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రధానంగా మారిందని, శారీరక, మానసిక శ్రమ ఒత్తిడి పోలీసులపై ఉంటుందన్నారు.
ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నా... క్రీడలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని, పోలీసు శాఖలో ఫిజికల్ ఫిటనెస్ ఎంతో అవసరమని పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. వ్యాయామం, క్రీడలు... పోలీసుల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతాయని, క్రీడలతో మనకు తెలియకుండానే మనసికంగా ధృడత్వాన్ని పొందుతామన్నారు. తమ వంతుగా పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని, ప్రజల సంరక్షణ అనేది పోలీసులకు ప్రధమ కర్తవ్యమని, పోలీసులకు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మహిళా పోలీసులు కూడా ఎక్కువమంది క్రీడల్లో పాల్గొంటున్నారని, విధుల్లో కూడా మహిళా పోలీసులు చాలా చురుకుగా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో అందరూ బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నానని రాజశేఖర్ బాబు అన్నారు. మొత్తం ఆరు టీంలు.. ఏడు అంశాలలో పోటి పడుతున్నారని తెలిపారు. ఈనెల 30 వ తేదీన ముగింపు సభ నిర్వహిస్తామని చెప్పారు. సమాజానికి పోలీసు శాఖ దిక్సూచిగా మారాలని, యువతను మంచి మార్గంలో నడిచేలా పోలీసులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలో యూత్ స్పోర్ట్స్‌ను కూడా నిర్వహించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. నేటి యువత క్రీడలు పూర్తిగా మరచి పోతోందని, వారికి క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తామన్నారు. మహిళలు కూడా ఇంటికే పరిమితం కాకుండా ఎంచుకున్న రంగంలో ఎదిగేలా ప్రోత్సహించాలని, క్రీడల ద్వారా మానసిక ఉత్సాహం తో విధుల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ
దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...
జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News