Share News

AP News: స్టేషనల్‌లో ఖాకీ కిక్కు..!!

ABN , Publish Date - May 31 , 2024 | 12:55 AM

సౌమ్యుడిలాా కనిపించే రవీంద్రలో చాలా లక్షణాలున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పటికీ తానే ఇన్‌స్పెక్టర్‌లా వ్యవహరించేవాడు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు రైటర్‌, అడ్మిన్‌ ఎస్‌ఐ వద్దకు వెళ్తాయి. ఇలా వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటినే ఇన్‌స్పెక్టర్‌ టేబుల్‌పై పెట్టేవాడు. ముఖ్యంగా స్పందన కార్యక్రమంలో వచ్చిన సివిల్‌ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను తన వద్ద పెట్టుకునేవాడు.

 AP News: స్టేషనల్‌లో ఖాకీ కిక్కు..!!
SI

స్టేషన్‌ ఛాంబర్‌లో కూర్చుని మందు పార్టీ

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో

ప్రస్తుతం కాకినాడ రూరల్‌ మండలంలో విధులు

ఆది నుంచి రవీంద్రపై అనేక ఆరోపణలు


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : పైకి సౌమ్యుడిగా, ఎంతో మర్యాదస్తుడిలా కనిపించే రవీంద్రలో చాలా లక్షణాలున్నాయి. వాస్తవానికి ఇన్‌స్పెక్టర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పటికీ తానే ఇన్‌స్పెక్టర్‌లా వ్యవహరించేవాడు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు రైటర్‌, అడ్మిన్‌ ఎస్‌ఐ వద్దకు వెళ్తాయి. ఇలా వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటినే ఇన్‌స్పెక్టర్‌ టేబుల్‌పై పెట్టేవాడు. ముఖ్యంగా స్పందన కార్యక్రమంలో వచ్చిన సివిల్‌ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను తన వద్ద పెట్టుకునేవాడు. విచారణ పేరుతో వారిని స్టేషన్‌కు పిలిపించి బేరాలు మాట్లాడేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని కొంతమంది బాధితులు బహిరంగంగా చెబుతున్నారు. నైట్‌ రౌండ్స్‌ తిరిగే క్రమంలో కొంతమంది రాజకీయ నాయకుల కార్యాలయాల్లో విందులు చేసుకునేవాడనే ఆరోపణలూ ఉన్నాయి.


పైసా వసూల్

లాక్‌డౌన్‌ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించిన వాహనాలను గొల్లపూడి వై జంక్షన్‌ వద్ద నిలుపుదల చేసి ముడుపులు వసూలు చేశాడని, ముఖ్యంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లను సరఫరా చేసే లారీలు, వాహనాలను పట్టుకోకుండా ఉండేందుకు ఆ మాఫియా నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడని కూడా చెబుతున్నారు. రవీంద్ర చేసిన సెటిల్‌మెంట్లలో బాధితులుగా మారిన వారు ఇప్పుడు బయటకు వస్తున్నారు. గొల్లపూడికి చెందిన కొందరు టీడీపీ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాసినట్టు తెలిసింది. రవీంద్ర అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారని సమాచారం.


అధికారులు ఏం చేస్తారు?

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో తాజాగా జరిగిన ఘటనకు సంబంధించినది కాదు. 2021లో జరిగిన ఘటన అని స్వయంగా రవీంద్ర చెబుతున్నాడు. దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్‌ ఆయనకు మోమో గానీ, షోకాజ్‌ నోటీసు గానీ జారీ చేసి సంజాయిషీ తీసు కునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఆయన ఏలూరు రేంజ్‌ డీఐజీకి క్రమశిక్షణా చర్యల నిమిత్తం పంపే సూచనలు కనిపిస్తున్నాయు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున తలనొప్పులు ఎందుకులే అనుకుంటే తక్షణమే రవీంద్రపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఓరల్‌ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయవచ్చు.

Updated Date - May 31 , 2024 | 09:55 AM