AP News: పవన్ కళ్యాణ్‍కు బెదిరింపు కాల్స్ కేసులో పురోగతి
ABN , Publish Date - Dec 10 , 2024 | 01:00 PM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తు చేసిన పోలీసులు పురోగతి సాధించారు. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేసి.. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేదని, మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేశాడని, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేషీకి బెదిరింపు కాల్స్ (Threatening calls) రావడం కలకలం రేపింది. పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు రావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు పురోగతి సాధించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి (Arrest) తీసుకున్నారు. నిందితుడు నూక మల్లికార్జున్ అని, మానసిక స్థితి సరిగ్గా లేదని, మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో వైజాగ్‍లో నూక మల్లికార్జున్‍పై 354 కేసు నమోదైంది.
కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు దుండగుడు. దీంతో పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజ్‌ల గురించి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే తెలియజేశారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పెట్టిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హోంమంత్రి ఆరా..
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. మెసేజ్‌లు , ఫోన్ కాల్స్ వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఘటనపై చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీని వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు.
వారి పనేనా...
ఇటీవలే రేషన్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉక్కుపాదం మోపారు. పవన్ స్వయంగా కాకినాడ పోర్టుకు వెళ్లి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సముద్రం లోపలికి వెళ్లిన ఓడలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పవన్ పట్టుకుని కేసులు నమోదు చేయించారు. ఈ సంఘటన తర్వాతే ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపుల వ్యవహారంలో రేషన్ అక్రమ రవాణా మాఫియా హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..
తెలంగాణ తల్లి రూపం మారిస్తే కఠిన చర్యలు
డ్రైవర్‌తో భార్గవ్ దొంగ అరెస్టు డ్రామా
మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News