Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:25 AM
మూడు రాజధానుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడారు. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ నిర్వాకంతో ర్యాప్ట్ ఫౌండేషన్ నీటిలోనే నానుతోంది. ఇప్పుడు ర్యాప్ట్ ఫౌండేషన్ వద్ద నిండిన నీటిని తోడే పనిని అధికారులు ప్రారంభించారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati)లో జీఏడి (GAD) , హెచ్‌వోడీ (HOD), హైకోర్టు (High Court), అసెంబ్లీ భవనాల (Assembly Buildings) పనులకు సన్నాహక పనులను సీఆర్డీఏ (CRDA) వేగవంతం చేస్తోంది. ముందుగా ర్యాప్ట్ ఫౌండేషన్ (Rapt Foundation) వద్ద నిండిన నీటిని తోడే పనిని అధికారులు ప్రారంభించారు. భారీ ఎత్తున మోర్టార్‌లు ఏర్పాటు చేసి నీటిని తోడే పనిని సీఆర్డీయే వేగవంతం చేసింది. దీనికి సంబంధించి ట్రాక్టర్‌లకు మొటార్లు పెట్టి, భారీ మోటర్‌లతో నీటిని నీటిని తోడే పనిని ముమ్మరం చేశారు. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ నిర్వాకంతో ర్యాప్ట్ ఫౌండేషన్ నీటిలోనే నానుతోంది. అయితే పౌండేషన్ పటిష్టతకు డోకా లేదని నిర్మాణాలు కొనసాగించుకోవచ్చని ఇప్పటికే హైదరాబాద్, మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది.
మూడు రాజధానుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడారని మంత్రి నారాయణ ఆరోపించారు. శనివారం నెరెడ్కో ఆధ్వర్యంలో 2025 డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, నెరెడ్కో ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... గత ఐదేళ్లల్లో రియల్ ఎస్టేట్ ఏమైందో అందరూ చూశారని అన్నారు. ఎక్కడైనా రియల్ ఎస్టేట్ డెవలప్ అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాను ఇక్కడ పరిస్థితులు తెలుసుకుని టౌన్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని అన్నారు. నెరెడ్కో ప్రతినిధులు కూడా తనను కలిసి పరిస్థితి వివరించారన్నారు. నూతన విధానాలను ఈనెల 30లేదా 31 విడుదల చేస్తామని ప్రకటించారు. సెల్లార్ నిర్మాణంలో ఉన్న ఇబ్బందులు పరిష్కరిస్తామని తెలిపారు.
2014లో ఆన్‌లైన్‌లో అనుమతి ఇచ్చే విధానం మనమే అమలు చేశామని, సింగిల్ విండో విధానం కూడా అమలు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. టౌన్ ప్లానింగ్ వాళ్ల నుంచి కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయన్నారు. వారి వైపు ఉన్న సమస్యలు పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారులు కొర్రీ పెడుతూ అనుమతులు ఆపుతున్నారన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత తాను అనుమతి ఇప్పించానని గుర్తుచేశారు. ఆన్‌లైన్ విధానంలో సాప్ట్ వేర్ అప్ డేట్ చేయాలని గుర్తించామన్నారు. ఫిబ్రవరి నాటికి ఈ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు.అన్ని డిపార్ట్మెంట్ అనుమతులు ఆన్ లైన్‌లో వచ్చేలా చేస్తామన్నారు. అమరావతి రాజధానిగా నిర్మాణం చేయకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధి పనులను నిరుపయోగంగా చేశారన్నారు. జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. ఒకేసారి రాజధానిలో రూ. 60 వేలకోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అధికారిక భవనాలు, టవర్స్ నిర్మాణం, విశాలమైన రోడ్లు నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏడాదిలోగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా రాష్ట్రం కూడా అన్ని విధాలా వృద్ధి చెందుతుందని చెప్పారు.మీరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారాయణ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు
కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..
ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News