Share News

Minister Lokesh: జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుంది..

ABN , Publish Date - Oct 11 , 2024 | 01:37 PM

యాక్షన్ అయితే అనివార్యమని, వైసీపీ వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే స్పష్టత లేదని.. కానీ తన నుంచి ఇన్స్పైర్ అయ్యారని అర్ధమైందని, రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయని, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.

Minister Lokesh: జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుంది..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP)లో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని (Red Book Action Start), చట్టాన్ని ఉల్లంఘించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని, చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్‌కు రెడ్ బుక్‌లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు ఉందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. యాక్షన్ అయితే అనివార్యమని, వైసీపీ (YCP) వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే స్పష్టత లేదని.. కానీ తన నుంచీ ఇన్స్పైర్ అయ్యారని అర్ధమైందన్నారు. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయని, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని, బ్లూ బ్యాచ్ ఆగడాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అనిపిస్తే ఎంతమాత్రం ఉపేక్షించమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వరదలొస్తే జగన్‌లా పరదాలు కట్టుకునట్లు.. సీఎం చంద్రబాబు అండ్ టీమ్ ఇంట్లో కూర్చోలేదన్నారు. మాజీ సీఎం జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుందని ఎద్దేవా చేశారు. గతంలో ఇలానే ఆత్మలతో మాట్లాడి కియా తమ ఘనతే అన్నారని, ఇప్పుడు టీసీఎస్ గురించి ఏ ఆత్మతో మాట్లాడారని ప్రశ్నించారు. జగన్ హయాంలో తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నామని.. ఇందుకు లూలూ, అశోక్ లైల్యాండ్ లే ఉదాహరణ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

కాగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్‌ ఇటీవల ముంబైలో టాటా సన్స్‌ బోర్డు చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమొబైల్‌ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. ఇంకోవైపు.. హీరానందానీ సంస్థల డైరెక్టర్‌ హర్ష్‌ హీరానందానీతో సమావేశం అయినట్లు నారా లోకేశ్ ప్రకటించారు. రాయలసీమలో ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు, విశాఖలో గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌లకు ఉన్న అవకాశాలపై చర్చించానని లోకేశ్‌ పేర్కొన్నారు


కాగా గత వైసీపీ ప్రభుత్వం ప్రచార పిచ్చితో రేషన్‌ కార్డులను కూడా తమ పార్టీ రంగులతోనే నింపేసింది. వాటిపై ఒకవైపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మరోవైపు జగన్‌ బొమ్మలు ముద్రించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆ కార్డులపైనే రేషన్‌ సరుకులు సరఫరా చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాత రేషన్‌కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్‌కార్డుల రూపకల్పనపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కసరత్తు చేస్తోంది.

ఇందుకోసం అధికారులు పలు డిజైన్లు పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగుతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. దాంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌ కార్డు’ నినాదంతో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్‌ కార్డులు జారీ చేస్తున్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల వల్ల వలస కార్మికులు, కుటుంబాలు దేశంలో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన: మంత్రి

జాయ్ జమీమా దారుణాలు.. వెలుగులోకి వస్తున్న నిజాలు..

సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

విజయవాడ: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 11 , 2024 | 01:47 PM