TDP: టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్
ABN , Publish Date - Dec 18 , 2024 | 10:59 AM
Andhrapradesh: టీడీపీకి చెందిన యూట్యూబ్ ఛానల్‌ను దుండగులు హ్యాక్ చేశారు. దీంతో ఉదయం నుంచి ఛానల్ నిలిచిపోయింది. ఛానల్‌ను ఓపన్ చేసిన వారికి స్ట్రక్ అయినట్టు వస్తుందని ఫిర్యాదు చేశారు. దీనితో టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. హ్యాకర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది.
అమరావతి, డిసెంబర్ 18: టీడీపీ (TDP) అధికారిక యూట్యూబ్ చానెల్ (Youtube Channel) హ్యాక్ అయ్యింది. టీడీపీకి చెందిన యూట్యూబ్ ఛానల్‌ను దుండగులు హ్యాక్ చేశారు. దీంతో ఉదయం నుంచి ఛానల్ నిలిచిపోయింది. ఛానల్‌ను ఓపన్ చేసిన వారికి స్ట్రక్ అయినట్టు వస్తుందని ఫిర్యాదు చేశారు. దీనితో టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. హ్యాకర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. హ్యాక్ విషయాన్ని యూట్యూబ్ యాజమాన్యానికి పార్టీ వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఛానల్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నింస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేయడంతో ఈరోజు ఉదయం నుంచి అందులో ప్రసారాలు ఆగిపోయాయి. టీడీపీ యూట్యూబ్ ఛానల్‌లో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రెస్‌మీట్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలు, కార్యక్రమాలు, ఆయన మాట్లాడుతున్న లైవ్‌లు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివిధ అంశాలను ప్రసారం చేస్తారు. టీడీపీ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీకి చెందిన ముఖ్యనేతలు యూట్యూబ్ ఛానల్‌ను ఫాలో అవుతుంటారు. ఈరోజు ఉదయం యూట్యూబ్ ఛానల్‌ను ఆన్ చేయగా ‘‘ద పేజ్ ఈజ్ నాట్ అవేలబుల్’’ అనే మెసేజ్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది.
టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్‌కు గురైనట్లు గుర్తించారు. అలాగే ఈ అంశంపై యూట్యూబ్ యాజమాన్యానికి పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేశాయి. మరలా ఛానల్‌ను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ హ్యాక్ గురైన విషయాన్ని చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే యూట్యూబ్ ఛానల్‌ను పునరుద్దరించాలని కేంద్ర కార్యాలయం వర్గాలను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ఐటీ వింగ్ రంగంలోకి దిగి యూట్యూబ్ ఛానల్‌ను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. తొలిసారిగా ఇలా జరగడంపై పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్‌లో వచ్చే ప్రతీ విషయాన్ని టీడీపీ శ్రేణులు ఫాలో అవుతుంటారు. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాక్ అవలేదని.. ఒక్కసారిగా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యిందని తెలిసి పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. హ్యాక్‌ర్లు ఎవరు?.. ఎక్కడి నుంచి హ్యాక్ చేశారో గుర్తించేందుకు టీడీపీ టెక్నిల్ విభాగం ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి..
పీటల మీద నిలిచిన ఐపీఎస్ వివాహం.. వధువు తల్లికి గుండెపోటు
వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ
Read Latest AP News And Telugu News