Telugu pilgrims: కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితం
ABN , Publish Date - Sep 14 , 2024 | 10:32 AM
Andhrapradesh: కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. కొంత మంది యాత్రికులు గుప్త కాశీకి చేరుకున్నారు. మరికాసేపట్లో గుప్తకాశీకి మరో ముగ్గురు యాత్రికులు చేరుకోనున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: కేదార్‌నాథ్ యాత్రలో ( Kedarnath Yatra) చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. కొంత మంది యాత్రికులు గుప్త కాశీకి చేరుకున్నారు. మరికాసేపట్లో గుప్తకాశీకి మరో ముగ్గురు యాత్రికులు చేరుకోనున్నారు. ఆపదలో ఉన్నామని, కిందకు చేరుకోలేక పోతున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని (MP Kalishetti Appalanaidu) పలువురు యాత్రికులు సంప్రదించారు.
Telangana: ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..
విషయాన్ని మంత్రి లోకేష్, సీఎం కార్యాలయం దృష్టికి ఎంపీ అప్పలనాయుడు తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్, సీఎం కార్యాలయం ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో యాత్రికులు ఈరోజు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఆపద సమయంలో వెంటనే స్పందించిన మంత్రి లోకేష్‌కు, సీఎం కార్యాలయానికి యాత్రికులు ధన్యవాదాలు తెలిపారు.
Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..
కాగా... కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులకు సంబంధించి లోకేష్ నిన్న (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. కేదార్ నాథ్లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంన్నామన్నారు. ఇందుకోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నామని.. ఈలోగా వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామని అన్నారు. కేదార్ నాథ్లో చిక్కుకున్న యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాకు ప్రధాని.. కారణమిదే..
Chandrababu: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చంద్రబాబు
Read LatestAP NewsANdTelugu News