Share News

Kodali Nani: అటు ఓటమి.. ఇటు కొడాలి నానికి ఊహించని ఝలక్..!

ABN , Publish Date - Jun 09 , 2024 | 07:58 AM

గుడివాడలో గడ్డం గ్యాంగ్‌కు ప్రజలు జలక్ ఇచ్చారు. కొడాలి నాని (Kodali Nani) అనుచరులు ఆక్రమించుకున్న 7.66ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్‌లో రూ.100కోట్ల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నాని అనుచరులు ఆక్రమించుకున్నారు.

Kodali Nani: అటు ఓటమి.. ఇటు కొడాలి నానికి ఊహించని ఝలక్..!

గుడివాడ: గుడివాడలో గడ్డం గ్యాంగ్‌కు (Gaddam Gang) ప్రజలు జలక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అనుచరులు ఆక్రమించుకున్న 7.66ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్‌లో రూ.100కోట్ల స్థలాన్ని నాని అనుచరులు ఆక్రమించుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో స్థల యజమానులకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. దీంతో స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్, లేఅవుట్‌లో గడ్డం గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను జేసీబీలతో ధ్వంసం చేశారు.


బాధితులు ఏమన్నారంటే..!

గుడివాడలో 160మందికి చెందిన ఫ్లాట్లను నాని అనుచరులు (kodali nani followers) ఆక్రమించుకున్నారని, ఇందేటని అడిగితే రౌడీలతో దాడి చేయించారని బాధితులు వాపోయారు. కొంతమంది వైసీపీ వర్గీయుల స్థలాల్నీ ఆక్రమించారని చెప్పుకొచ్చారు. బాధిత వైసీపీ కార్యకర్తలు, నేతలు తమకైన న్యాయం చేయమని అడిగితే 20ఏళ్ల క్రితం నాటి రేటే ఇస్తామంటూ ఎమ్మెల్యే అనుచరులు సమాధానం చెప్పారన్నారు.

బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని అనుచరులతో కొడాలి నాని కబ్జా చేయించారని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించడమే కాకుండా తమపై దాడి చేయించారని వాపోయారు. న్యాయం కోసం పోలీసులను వేడుకున్నాం, కోర్టులను ఆశ్రయించాం, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగామని అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.


అందరినీ 420అనే కొడాలి నానినే అసలైన 420 అని, ఆయన్ను గుడివాడ నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. ఆశలు వదిలేసుకున్న తరుణంలో టీడీపీ విజయం సాధించడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అండగా నిలబడ్డారని సంతోషం వ్యక్తం చేశారు. లేఅవుట్లో "డౌన్ డౌన్ కొడాలి నాని.. జిందాబాద్ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము" అంటూ స్థల యజమానులు నినాదాలు చేశారు.

For more Andhrapradesh News and Telugu News..

Updated Date - Jun 09 , 2024 | 09:45 AM