AP News: రెండు రోజుల క్రితం రెక్కి.. అర్ధరాత్రి దొంగతనం.. చివరకు
ABN , Publish Date - Dec 18 , 2024 | 01:47 PM
Andhrapradesh: పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలో అర్ధరాత్రి ఓ దొంగ హల్‌చల్ చేశారు. అర్థరాత్రి సమయంలో గ్రామ శివారు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చొరబడి దోపిడీకి యత్నించాడు. ఇల్లు తాళాలు ధ్వంసం చేస్తుండగా అలికిడి గమనించిన ఓ వృద్ధుడు.. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 18: ఓ దొంగ అర్ధరాత్రి పూట దొంగతనం చేసేందుకు వచ్చాడు. తాపీగా అందరూ నిద్రపోతున్న సమయంలో వచ్చిన ఆ దొంగ ఓ వృద్ధుడి ఇంట్లో చోరీకి ప్రయత్నించాడు. అనకున్నట్టు గానే ఇంట్లో వెళ్లేందుకు తాళాలు పగులగొట్టాలని చూశాడు. అయితే దీన్ని గమనించిన వృద్ధుడు కేకలు వేయగా... అతడిపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. చివరకు అతడి పాపం పండి స్థానికులు చిక్కాడు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
టెస్టుల్లో బెస్ట్ బౌలింగ్ వీరులు వీళ్లే..
పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలో అర్ధరాత్రి ఓ దొంగ హల్‌చల్ చేశారు. అర్థరాత్రి సమయంలో గ్రామ శివారు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చొరబడి దోపిడీకి యత్నించాడు. ఇల్లు తాళాలు ధ్వంసం చేస్తుండగా అలికిడి గమనించిన ఓ వృద్ధుడు.. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ దొంగ.. వృద్ధుడుపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వృద్ధుడు కేకలు వేయడంతో గ్రామస్తులంగా నిద్రలేచారు. ఓ దొంగ ఇళ్లలో దొంగతనానికి వచ్చాడని సదరు వృద్ధుడు గ్రామస్థులకు తెలిపాడు. జరిగిన ఘటన తెలిసుకున్న గ్రామస్తులు.. దొంగ కోసం తీవ్రంగా గాలించారు. గ్రామంతో పాటు పంట పొలాల్లోనూ గ్రామస్తులు తనిఖీ చేశారు. చివరకు గ్రామ శివారు పంటపొలంలో ఉన్నట్లు గమనించిన గ్రామస్తులు దొంగను పట్టుకున్నారు. తాళ్ల సహాయంతో బంధించి పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అయితే దొంగ పట్టుకున్న సమయంలో అతడు చెప్పిన విషయాలు విని గ్రామస్థులు షాక్ అయ్యారు.
రెండు రోజుల క్రితం గ్రామంలో రెక్కి నిర్వహించినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. సుమారు ఎనిమిది మంది (కుటుంబ సభ్యుల) వచ్చినట్లు దొంగ తెలిపారు. వీరంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పది రోజుల క్రితం జగ్గయ్యపేట వత్సవాయి మండలంలో వరస దొంగతనాలు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురిచేశారు. ఇప్పుడు తాజాగా గ్రామాల్లో రెక్కీలు నిర్వహించి మరీ దొంగతనాలు చేస్తున్న సమాచారం తెలుసుకుని ప్రజలు వణికిపోతున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి..
పీటల మీద నిలిచిన ఐపీఎస్ వివాహం.. వధువు తల్లికి గుండెపోటు
వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ
Read Latest AP News And Telugu News