Share News

AP Politics: నిసిగ్గుగా ఫేక్ ప్రచారాలకు మద్దతు.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తోందా..

ABN , Publish Date - Nov 15 , 2024 | 09:56 AM

సామాజిక మాద్యమాల్లో ఫేక్ ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు మొదలుపెట్టడంతో వారికి అండగా వైసీపీ ఉంటుందంటూ ప్రత్యేక బృందాల పేరిట జిల్లాకు ఇధ్దరు వ్యక్తులను వైసీపీ నియమించింది. వీరంతా సోషల్ మీడియాలో వైసీపీ తరపున ఫేక్ ప్రచారాలు చేసేవారికి అండగా ఉంటారని ఆ పార్టీ చెప్పకనే..

AP Politics: నిసిగ్గుగా ఫేక్ ప్రచారాలకు మద్దతు.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తోందా..
YSRCP

అధికారం కోల్పోయినప్పటినుంచి వైసీపీకి ఏమైందనే ప్రశ్నలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాకు అండగా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు వైసీపీ ప్రకటించింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఈ బృందంలో సభ్యులుగా నియమించింది. సామాజిక మాద్యమాల్లో ఫేక్ ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు మొదలుపెట్టడంతో వారికి అండగా వైసీపీ ఉంటుందంటూ ప్రత్యేక బృందాల పేరిట జిల్లాకు ఇధ్దరు వ్యక్తులను వైసీపీ నియమించింది. వీరంతా సోషల్ మీడియాలో వైసీపీ తరపున ఫేక్ ప్రచారాలు చేసేవారికి అండగా ఉంటారని ఆ పార్టీ చెప్పకనే చెప్పింది. సాధారణంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. పరిధి, పరిమితులు దాటనంత వరకు బాగానే ఉంటుంది. కానీ పరిమితులు దాటితే చట్టప్రకారం చర్యలు తప్పవు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా సమాచారాన్ని వేగంగా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. అదే సమయంలో అబద్ధాలు, అసత్య ప్రచారం సామాజిక మాద్యమాల్లో ఎక్కువైంది. సోషల్ మీడియాలో నిత్యం లక్షల సంఖ్యలో పోస్టులు పెడుతుంటారు. ఒకవేళ సోషల్ మీడియాలో విమర్శనాత్మకంగా పోస్టులు చేసేవారిపై కేసులు పెట్టుకుంటూ పోతే.. దీనికోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పుకాదు.. ప్రశ్నల పేరిట ఇతరుల స్వేచ్ఛను హరించడం తప్పవుతుంది. ఏపీలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పోస్టులు పెడుతున్నవారిపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించడంతో.. వారికి వైసీపీ మద్దతుగా నిలవడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.


ఫేక్ వద్దని చెప్పాల్సింది పోయి..

వైసీపీకి మద్దతుగా ఉంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిని హెచ్చరించి, అలాంటి పోస్టులను నియంత్రించాల్సిన వైసీపీ దానికి విరుద్దంగా ఫేక్ ప్రచారం చేస్తూనే ఉండండి.. తమ పార్టీ మద్దతుగా ఉంటుందని ప్రకటించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫేక్ పోస్టులు మాని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నిద్దామనే సందేశాన్ని పార్టీ కేడర్‌కు పంపకుండా.. తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి మద్దతుగా ఉంటామని జగన్ ప్రకటించడం ఓ విధంగా మరిన్ని తప్పులు చేయాలని పార్టీ శ్రేణులను, అభిమానులను ప్రోత్సహించేవిధంగా ఉన్నాయనే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమవుతోంది.


అంతా ఫేక్..

వైసీపీ దేశంలోనే కాకుండా కొంతమంది విదేశాల్లో ఉంటూ పార్టీని అభిమానించే వ్యక్తులతో ఫేక్ పోస్టులు చేయిస్తోంది. ఒకశాతం కూడా వాస్తవం కాని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని తప్పుదోవపట్టించడమే కాకుండా.. వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. ఈ క్రమంలో ఇప్పటికైనా వైసీపీ తన ఫేక్ ప్రచారాలకు స్వస్తి పలికి.. ప్రజాస్వామ్య పద్ధతిలో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తుందా లేదా పాత పద్ధతిలోనే ప్రయాణిస్తుందా అనేది తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 15 , 2024 | 10:01 AM