Share News

చంద్రబాబు క్షేమం కోసం ‘జయ జయ శత్రు భయంకర’: శ్రీనివాస్‌తో స్వరం కలిపిన కృష్ణయ్య

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:00 AM

సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య.. తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు.

చంద్రబాబు క్షేమం కోసం ‘జయ జయ శత్రు భయంకర’: శ్రీనివాస్‌తో స్వరం కలిపిన కృష్ణయ్య

విజయవాడ, జూన్ 14: మంత్ర సాధనలో ఉన్న వివిధ సారస్వత విద్యలలో అనేక అంశాల్ని అద్భుత రచనా సంకలన గ్రంథాలుగా అందించి తెలుగు లోగిళ్ళలో ఒక సుస్థిర పవిత్ర స్థానాన్ని అపురూపు విలువలతో సాధించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఇప్పటికి అందించిన సుమారు వందకుపైగా ఆర్ష భారతీయ గ్రంధాలలో దాదాపు అరవై ఐదు రకాల గ్రంధాలను ఇటీవల న్యూ ఢిల్లీ జాతీయ గ్రంధాలయానికి, తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అనురాధ బహూకరించిన విషయం మీడియా మేధో సమాజానికి ఎరుకే.

chaganti-koteswara-rao.jpg

ఇదిలా ఉండగా.. ఇటీవల నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆలయ అడిషనల్ కమీషనర్ కె.ఎస్. రామారావు పవిత్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో విఖ్యాత ధార్మికోపన్యాసకులు, మహా సరస్వతీ పుత్రులు చాగంటి కోటేశ్వర రావు ‘నారసింహో ... ఉగ్రసింహో’ అమోఘ మంగళ గ్రంధాన్ని, ఉపాసనా మార్గానికి మేలుబాటలు పరిచే ‘జయ జయోస్తు’ అపూర్వ గ్రంధాన్ని ఆవిష్కరించి పురాణపండ శ్రీనివాస్ అద్వితీయ ప్రతిభతో అందిస్తున్న ఋషుల మంగళప్రద దేవతారాధనల అనుగ్రహాన్ని వివరించి అభినందించారు. ప్రధానమైన అంశం ఏమంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల క్షేమం, ప్రజారంజకమైన పాలన కోసం అమ్మవారిని ప్రార్ధిస్తూ ఈ రెండు అందమైన పుస్తకాలను ప్రఖ్యాత వైద్య ఆరోగ్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఎంతో అంకితభావంతో దుర్గమ్మ సన్నిధికి సమర్పించడం ప్రత్యేక విశేషంగా పేర్కొనాలి. ఈ అద్భుతాలను ఆవిష్కరించిన ఆర్ష ధర్మోపన్యాసకేసరి చాగంటి కోటేశ్వరరావు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు, ఇటు బొల్లినేని కృష్ణయ్య సహృదయ సౌజన్యానికి, మరోప్రక్క పురాణపండ శ్రీనివాస్ ఉత్కృష్టమైన రచనా ముద్రణల సమర్ధతను మంగళాశాసనాలతో ప్రశంసిస్తూ.. తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి పరమోత్తమ, యజ్ఞభావనల, అంకితభావవు కార్యనిర్వహణాధికారిని చూడమని కె.ఎస్. రామారావును ప్రత్యేకంగా ప్రస్తావించి, ఇలాంటి ఈ.ఓని అధికారులు, సిబ్బంది కాపాడుకుంటే దుర్గమ్మ చల్లగా అనుగ్రహిస్తుందన్నారు.

Anam-Ramanarayana-Reddy.jpg

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో దేవాదాయ శాఖామంత్రిగా ఉన్నత పదవీస్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుని ఆలయమర్యాదానుసారం వైదిక లాంఛనాల మధ్య వేదపండితుల అఖండ ఆశీర్వచనం పొందడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వాలలో సినిమాటోగ్రఫీ శాఖామంత్రిగా, ఆర్ధిక శాఖామంత్రిగా, సమాచార శాఖామంత్రిగా వివిధ ఉన్నత పదవులతో తెలుగు రాష్ట్రాలలో ఎనలేని కీర్తి గడించిన ఆనం రామ నారాయణరెడ్డి సమర్ధతను, సేవలు తెలుసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పవిత్ర శాఖను ఆయనకు అప్పగించారు. దేవాదాయ శాఖామంత్రిగా ఆనం రామ నారాయణరెడ్డి నియమించబడ్డ కాస్సేపట్లోనే రామ నారాయణరెడ్డి దుర్గమ్మ సన్నిధికి రావడం కేవలం అమ్మవారి అనుగ్రహమే అంటున్నారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు.

Jaya-Jaya-Shatru-Bhayankara.jpg

మరొక ముఖ్యాంశం ఏమంటే.. సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని సన్నిహితులకు ఒక వైపు చెబుతూనే.. మరోవైపు శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు. యుద్ధ ప్రాతిపదికన పవిత్ర విలువలతో ఈ గ్రంధంతో పాటు అనేక దేవాలయాలకు అవసరమైన ఉత్కృష్టమైన తత్త్వ చింతనల, ధార్మిక ప్రవృత్తుల, స్తోత్రాల, కథల, సనాతన ధర్మ బలాలతో మరొక దివ్య గ్రంధాన్ని కూడా ‘నమో నమస్తే’ అంటూ వైదిక సొగసులతో రూపొందించడం కేవలం దైవబలంగానే భావించాలి.

Namo-Namsthe.jpg

అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పారిశ్రామికవేత్తగా పేరున్న బొల్లినేని కృష్ణయ్యతో సుమారు రెండు దశాబ్దాల విడదీయరాని పరిచయమున్న పురాణపండ శ్రీనివాస్ ఈ గ్రంధాలు రెండింటినీ బెజవాడ దుర్గమ్మ కారుణ్యంతోనే అందించించారని బొల్లినేని వర్గీయులు చెబుతున్నారు. దేవాదాయ శాఖామంత్రిగా శ్రీకారం చుడుతున్న ఆనం రామనారాయణరెడ్డికి మంగళ శుభసూచకంగా ఈ అక్షరాల మంత్ర పేటికలతో శుభమస్తు పలుకుతున్న బొల్లినేని కృష్ణయ్య సమర్పణాభావాన్ని, సహృదయతను పలువురు అభినందిస్తున్నారు.

Anam-and-KSR.jpg

గత రెండు మాసాలనుంచీ ‘చంద్రబాబు నాయుడు మళ్ళీ పగ్గాలు పడితేనే ఈ రాష్ట్రం వెలుగులతో నిండుతుందని, చంద్రబాబునాయుడే వస్తారు. ఆయనే రావాలి’ అని బలంగా సన్నిహితులతో, రాజకీయనేతలతో, మీడియా మిత్రులతో బొల్లినేని కృష్ణయ్య ఎంతో ఆర్తితో చెబుతూనే వున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడొకరు దుర్గమ్మ సన్నిధానంలోనే పేర్కొనడం గమనార్హం. చంద్రబాబు కంటే, రామనారాయణరెడ్డి కంటే వయస్సులో బొల్లినేని కృష్ణయ్య పెద్దవారైనా ఆయన స్వచ్ఛమైన సహృదయం అందరికీ ఎరుకే. ఇక ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అయితే నిస్వార్ధతకు, అసాధారణ ప్రతిభకు, అసాధారణ వక్తృత్వానికి , దైవీయ స్పృహకీ ఎత్తిన పవిత్ర జెండాగా తెలుగునాట లక్షలమంది భక్త పాఠకులకి ఎరుకే. పురాణపండ ప్రతీ గ్రంథంలానే ఈ రెండు అఖండ జ్యోతుల్లాంటి వెలుగుల గ్రంధాలూ చంద్రబాబునాయుడి అవిశ్రాన్త కృషిని , రామనారాయణరెడ్డి సమర్ధతను, బొల్లినేని కృష్ణయ్య సమర్పణాభావాన్ని దేవతాశక్తులతో ఆశీర్వదిస్తాయంటున్నారు పలువురు అర్చక పండితులు.

Anam-Brothers.jpg

గతంలో ఆనం రామనారాయణ రెడ్డి తన సోదరుడైన ఆనం వివేకానందరెడ్డితో కలిసి విజయవాడలో ఒక ప్రత్యేక సందర్భంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పవిత్ర హస్తాలతో ఆవిష్కరింపచేసిన మంత్రరాజాల అమృతకలశం ‘ఉపాసన’ మహా గ్రంధాన్ని కూడా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించి పరిమళాల్ని విరజిమ్మడం ఈ సందర్భంలో పేర్కొనక తప్పదు. నెల్లూరు జిల్లాలో అనేక ఆలయాలకు రామనారాయణ రెడ్డి సమర్పించిన వందలకొలది అందమైన పవిత్ర గ్రంధాలు కూడా పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనాలే అని ఆనం సన్నిహితులు, అనుచరులు ఈ సందర్భంలో ప్రస్తావించడం మంగళ పరిణామమే!

KS-Ramarao.jpg

ఇటీవల యాదాద్రి, తిరుమల గిరుల వేంకటాద్రి, విజయవాడ ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాల భక్తులకు బొల్లినేని కృష్ణయ్య సమర్పించిన గ్రంథ సంపద చరిత్రాత్మకమని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కె.వి రమణాచారి పేర్కొనడం కృష్ణయ్య అంకితభావానికి పట్టిన అచ్చమైన, స్వచ్ఛమైన అద్దమనే చెప్పాలి.

Updated Date - Jun 15 , 2024 | 12:46 AM