Home » KS Rama Rao
శ్రీవిద్యోపాసనలో అత్యంత ప్రధానమైన శ్రీదేవి ఖడ్గమాలానామాలతో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ పాదాల చెంత శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవడం తమ కుటుంబానికి ఎంతో ఎంతో సంతోషాన్నించ్చిందని భారతదేశమంతటా అనేక శాఖలతో విస్తరించిన కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య పేర్కొన్నారు.
సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య.. తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు.
దుర్గమ్మకి బొల్లినేని సమర్పించిన పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర పేటికకు అసాధారణ స్పందన వచ్చిందని ఆలయ వర్గాలు ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చడం గమనార్హం. ఈ కారణంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు, శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయ ప్రధానార్చకులకు వచ్చే సోమవారం ‘శంభో మహాదేవ’ అమోఘ గ్రంధాలను వేలకొలది ప్రతులను శివమయంగా, రుద్రమయంగా బొల్లినేని కృష్ణయ్య అందించనున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
జాతీయ స్థాయిలో పేరు పొందిన బొల్లినేని కృష్ణయ్య ఒక చారిత్రాత్మకమైన పవిత్ర కార్యం చేపట్టడం ఇటు రాజకీయ వర్గాల్ని, అటు విజ్ఞుల్ని ఆకర్షించింది. ఈ నెల తొమ్మిదవ తేదీన మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలకు ‘జయ జయోస్తు’ పలుకుతూ రెండు అపురూప మంగళ గ్రంధాలను శరవేగంగా రూపొందింపజేస్తున్నారు. అవే ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.
పురాణపండ శ్రీనివాస్ భక్తి రసాత్మకంగా అందించిన లక్ష్మీనారసింహుని దివ్య సాన్నిధ్యం ‘ఉగ్రం ... వీరం’ అమోఘ గ్రంధంలో నృసింహావిర్భావ ఘట్టం గాథని చదివితే వొళ్ళు గగుర్పొడుస్తూ ఒక పవిత్ర అనుభూతి కలుగుతుందని....శ్రీనివాస్‌కి, ఆయన రచనా వైభవానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉందని విఖ్యాత ప్రవచనకర్త, సరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనం ‘ఉగ్రం ... వీరం’ అపురూప గ్రంధాన్ని విజయవాడ దుర్గమ్మ దేవస్థాన ప్రత్యేక వేదికపై ఆయన ఆవిష్కరించారు
రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమ శోభాయమానంగా రూపొందించిన సౌభాగ్య దివ్య గ్రంధాన్ని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల పవిత్ర వేదికపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు.
ప్రతీ చైత్రమాసంలో... ప్రతీ వసంత ఋతువులో... రచయిత, జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ ఏదో ఒక అద్భుతాన్ని భక్త పాఠకులకు సమర్పిస్తుంటారు. ఈసారి కృష్ణమ్మ తరంగాలలో వేప పూల గాలులు ఊరేగుతుండగా మామిడాకుల ఆకుపచ్చని పరిమళాలు కనకదుర్గమ్మ పాదాలను సేవిస్తుండగా... ఒక అపురూపమైన ‘సౌభాగ్య’ మంత్ర గ్రంధాన్ని జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ఇంద్రకీలాద్రికి సమర్పించింది.