శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:48 PM
గ్రామాల్లో ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ హెచ్చరించారు.
పగిడ్యాల, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ హెచ్చరించారు. మండలంలోని ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను, కేసుల వివరాలను ఎస్‌ఐ శరత్‌కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారికి తక్షణమే న్యాయం చేయాలని, కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో బెల్టుషాపులు, సారా విక్రయాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు చేస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ వెంట నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఉన్నారు.