భూ సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:51 PM
మస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.
గడివేముల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. దుర్వేసిలో మంగళవారం తహసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభు త్వంలో భూ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. నూతనంగా మంజూరైన వారికి పింఛన్‌లు పంపిణీ చేశారు. దుర్వేసి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, మాజీ కో-ఆప్షన్ మెంబర్ ఎస్‌ఏ రఫీక్, పంట రామచంద్రారెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, కాలిద్‌బాషా, గని హర్ష, ఈశ్వర్ రెడ్డి, గిరిబాబు, శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.
దుర్వేసిలో టీడీపీ బీసీ సెల్ పాణ్యం నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణయాదవ్ ఏర్పాటు చేసిన కేక్‌టను ఆమె కట్ చేశారు. పార్టీ నాయ కులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు.