Share News

వాజ్‌పేయికి ఘన నివాళి

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:55 AM

నంద్యాల గ్రీన్‌ సొసైటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు.

వాజ్‌పేయికి ఘన నివాళి
ఆత్మకూరులో వాజ్‌పేయి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులు

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నంద్యాల గ్రీన్‌ సొసైటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అట ల్‌ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. బుధవారం సోసైటీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సభ్యులు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అఅర్పించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ వాజ్‌పేయి దేశానికి ప్రధానికిగా సుపరిపాలన అందజేసి చరిత్రలో నిలిచారని కొనియాడారు. వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు శేషఫణి, సభ్యులు శ్రీనివాసులు, సాంబశివారెడ్డి, కిరణ్‌, సంతోష్‌, రాజు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాచ్‌పేయి జయంతిని పురస్కరించుకొని ఆత్మకూరులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో వాజ్‌పేయి ఒకరు అని అన్నారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు సాంబశివగౌడ్‌, నాయకులు గోపాల్‌, నూర్‌బాషా, మహేష్‌బాబు, అస్మతుల్లా తదితరులు ఉన్నారు.

ఆత్మకూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ నియోజకవర్గం కన్వీనర్‌ మోమిన్‌ షభాన ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

పాములపాడు(ఆంధ్రజ్యోతి): పాములపాడులో మాజీ ప్రధానిని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలను బీజేపీ రాష్ట్ర నాయకుడు చల్లా దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం వాజ్‌పేయ్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాయపాటి మురళీమోహన్‌, హేమచంద్ర, నాగరాజు, రాజశేఖరశెట్టి, అవులయ్య, గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:55 AM