Atrocity: నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం
ABN , Publish Date - Dec 09 , 2024 | 09:29 AM
యువతులపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదు. యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లా, నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ బాలికపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.
నంద్యాల జిల్లా: ఏపీ (AP)లో ఇంటర్ విద్యార్థినిపై (Inter Student) పెట్రోల్ దాడి (Patrol attack) ఘటన సంచలనం సృష్టించింది. నంద్యాల జిల్లా, నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ బాలికపై ప్రేమోన్మాది (Love addict) దారుణానికి పాల్పడ్డాడు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి (17) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రేమించలేదని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థి లహరి మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ప్రేమోన్మాది కూడా వంటికి నిప్పటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా యువతులపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదు. యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాగా కడప జిల్లా, బద్వేలు, గోపవరంలో అక్టోబర్ 20న దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ బాలికపై స్నేహితుడి ముసుగులో ఉన్న వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కలవడానికి రమ్మని చెప్పి... పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపిన మేరకు.. బాధిత బాలిక (16) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేష్‌తో చిన్నప్పటి నుంచీ స్నేహం ఉంది. అతడికి వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేష్ మధ్యలో ఆ ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు పది కి.మీ. దూరంలో ఉన్న పీపీ కుంట చెక్‌పోస్టు వద్ద దిగి సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. కొంతసేపటికి విఘ్నేష్.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. కొందరు మహిళలు ఆమెను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అమ్మాయిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
సీఎం ఆదేశాలతో ముమ్మర గాలింపు
నిందితుణ్ని వెంటనే అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. వారు తీవ్రంగా గాలిస్తుండగా రాత్రి వేళ ఓ బృందానికి నిందితుడు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. బాలిక ప్రస్తుతం 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుధ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం
మనోజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్న పోలీసులు..
పారిపోయిన టెన్తు విద్యార్థుల కథ సుఖాంతం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News