Share News

విజేతలకు నగదు బహుమతుల ప్రదానం

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:40 AM

పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు చైతన్య సాయిశ్రీ, జ్యోత్స్నకు జాయింట్‌ కలెక్టరు విష్ణు చరణ్‌ నగదు బహుమతి అందజేసినట్లు హెచ్‌ఎం మేరి సునీత తెలిపారు.

 విజేతలకు నగదు బహుమతుల ప్రదానం
విద్యార్థినికి నగదు బహుమతి అందజేస్తున్న జేసీ

పాణ్యం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు చైతన్య సాయిశ్రీ, జ్యోత్స్నకు జాయింట్‌ కలెక్టరు విష్ణు చరణ్‌ నగదు బహుమతి అందజేసినట్లు హెచ్‌ఎం మేరి సునీత తెలిపారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర ్బంగా ఈనెల 21 తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలలో చైతన్యసాయిశ్రీ ప్రథమ బహుమతి రూ. 3 వేలు, వ్యాసరచన పోటీలో జ్యోత్స్న ద్వితీయ బహుమతి రూ. 2 వేలు జేసీతో పాటు, డీఈవో జనార్దన్‌ నుంచి అందుకున్నారన్నారు. నంద్యాల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా బాలికలకు నగదుతోపాటు జ్ఞాపికలు, ప్రశంశా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా బాలికలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

Updated Date - Dec 25 , 2024 | 12:40 AM