Chandrababu: నేడు ఎమ్మిగనూరులో చంద్రబాబు పర్యటన
ABN , Publish Date - Mar 31 , 2024 | 07:33 AM
కర్నూలు జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తేరు బజార్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
కర్నూలు జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదివారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తేరు బజార్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాగళం (Prajagalam) బహిరంగ సభ (Sabha)లో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. ఎమ్మిగనూరు (Emmiganur)లో జరగనున్న చంద్రబాబు పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు (Nagaraju), ఎమ్మెల్యే అభ్యర్ధి, బీవీ జయనాగేశ్వరరెడ్డి (Jayanageswara Reddy) కోరారు.
కాగా శనివారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా నాయుడుపేట, శ్రీకాళహస్తిల్లో నిర్వహించిన ప్రజాగళంలో బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘మన సభలు జనంతో కళకళలాడుతుంటే, జగన్ సభలు వెలవెలబోతున్నా యి. ఐదేళ్ల ఆయన పాలన ఎంత దారుణంగా తయారైందో ప్రజలంతా గమనించారు. ఒక సీఎం విధ్వంసకారుడైతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తే సరిపోతుంది. వైసీపీ అరాచకాలకు విసిగిపోయిన జనం ట్రెండు మారింది. జగన్‌కు బెండు తీసే సమయం వచ్చింది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలే తప్ప జగన్ ప్రభుత్వ ఆదేశాలు కాదన్న విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కొందరు పోలీసులు వైసీపీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారని, వారెవ్వరినీ వదిలిపెట్టం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
నాది విజనరీ, జగన్‌ది పాయిజనరీ
‘తెలుగు రాష్ట్రాలకు నేనేమీ చేయలేదని, నా మార్క్ ఏమీ లేదని జగన్ చెప్పాడు. నువ్వు గోలీలాడుకునేటప్పుడే, మీనాన్న కంటే ముందే ఉమ్మడి ఆంధ్రకు నేను సీఎం. అప్పుడే హైదరాబాద్‌కు ఒక విజన్ ఇచ్చా. ఇప్పుడు దేశంలోనే నంబరు వన్ సిటీగా ఉందంటే నేను చేసిన పనులే. రూ.200 కరెంటు బిల్లు ఇప్పుడు వెయ్యి రూపాయలైంది. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచకుండా కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం.. అదీ నా బ్రాండ్. నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయడం, అవినీతి లేకుండా అందించడమే నా బ్రాండ్. జాబు రావాలంటే బాబు రావాలనేది నా బ్రాండు. ఉద్యోగాలు లేని రాష్ర్ట్రంగా మార్చిన బ్రాండ్ నీది. నేను వస్తే పెట్టుబడిదారులు ఉత్సాహంగా వస్తారు. నువ్వువస్తే పారిపోతారు. నేను కియా తెస్తే, నీ పాలనలో అమరరాజా పారిపోయింది. రిలయన్స్ వెళ్లిపోయింది. ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి. అదీ నీ మార్కు. పోలవరాన్ని 72 శాతం పూర్తిచేయడం మా మార్కు, మిగిలిన పనులను పూర్తిచేయలేక చేతులెత్తేయడం మీ బ్రాం డ్. దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం మీ మార్కు, వారికి రక్షణ కల్పించడం మా మార్కు. దళితులను దగా చేయడం, రెడ్లకు డబుల్ ప్రమోషన్లు ఇవ్వడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈ ఎన్నికల్లో దళితులందరినీ మార్చావు కానీ, రెడ్లను మార్చలేదు. పెద్దిరెడ్డిని కదిలించలేవు. చెవిరెడ్డి భాస్కరరెడ్డికి డబుల్ ప్రమోషన్ ఇచ్చి కొడుక్కు ఎమ్మెల్యే, ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చావు. రాజకీయంగా ఎదుగుతారనుకునే దళితులను అణగదొక్కడమే జగన్ రెడ్డి నైజం. సీనియర్లను గౌరవించి వారిని గెలిపించడం టీడీపీకి తెలిసిన సంస్కారం. వైసీపీ నేతల మాటలు నమ్మి మైనార్టీలు మోసపోవద్దు. నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తున్నాం. సంపద సృష్టించి పేదలకు పంచుతాం.’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.