Share News

క్రిస్మస్‌ కాంతులు

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:46 AM

క్రిస్మస్‌ సందర్భంగా పట్టణంలోని డయాసిస్‌ హోలీక్రాస్‌ కెథడ్రల్‌ చర్చి (పెద్ద చర్చి), పరిశుద్ధ ముత్తయి చర్చిం, సాయిబాబానగర్‌ చర్చి, డేనియల్‌పురం చర్చి, సుధాకర్‌ చర్చి, గోపాల్‌ నగర్‌ చర్చి, వీసీ కాలనీ చర్చి, ఎస్సార్బీసీ కాలనీలోని చర్చి, సెయింట్ ఆల్పన్సస్‌ చర్చి తదితర చర్చిలను ముస్తాబు చేశారు.

క్రిస్మస్‌ కాంతులు
నంద్యాల జిల్లా వెలుగోడులో ముస్తాబైన చర్చి

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ సందర్భంగా పట్టణంలోని డయాసిస్‌ హోలీక్రాస్‌ కెథడ్రల్‌ చర్చి (పెద్ద చర్చి), పరిశుద్ధ ముత్తయి చర్చి, సాయిబాబానగర్‌ చర్చి, డేనియల్‌పురం చర్చి, సుధాకర్‌ చర్చి, గోపాల్‌ నగర్‌ చర్చి, వీసీ కాలనీ చర్చి, ఎస్సార్బీసీ కాలనీలోని చర్చి, సెయింట్ ఆల్పన్సస్‌ చర్చి తదితర చర్చిలను ముస్తాబు చేశారు.

గోస్పాడు(ఆంధ్రజ్యోతి): మండలంలో చర్చిలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. చర్చిల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): శ్రీశైల నియోజకవర్గంలో బుధవారం క్రిస్మస్‌ సందర్భంగా అన్ని చర్చీలను ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ప్రత్యేకించి ఆత్మకూరు పట్టణంలోని ఏబీఎం పాలెం, ఎస్పీజీ పాలెం, ఇందిరానగర్‌, లక్ష్మీనగర్‌ తదితర కాలనీల్లోని చర్చీలన్నింటికీ విద్యుత్‌ అలంకరణ చేశారు. అలాగే కరివేన రస్తాలో ఉన్న ఆర్‌సీఎం చర్చిని కూడా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని గౌడ్‌సెంటర్‌, కప్పలకుంట, కేజీ రోడ్డు తదితర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

వెలుగోడు(ఆంధ్రజ్యోతి): మండలంలో క్రిస్మస్‌ సందర్భంగా చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. బుధవారం క్రైస్తవుల ప్రార్థన నిమిత్త ప్రార్థన మందిరాల్లో ఏర్పాట్లు చేశారు.

మిడుతూరు(ఆంధ్రజ్యోతి): కడుమూరు, మాసపేట, తలముడిపి, అలగనూరు, మిడుతూరు, 49 బన్నూరు గ్రామాలతో పాటు వివిధ గ్రామాల్లో క్రిస్మస్‌ సందర్భంగా చర్చిలకు విద్యుత్‌ దీపాలతో అలంకరణలు చేశారు. ప్రార్థనకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

పాణ్యం(ఆంధ్రజ్యోతి): మండలంలోని చర్చిలు రంగుల వెలుగుల్లో నిండిపోయాయి, ఆలమూరు సీఎస్‌ఐ చర్చిని ఆలయ సంఘపెద్దల ఆద్వర్యంలో రంగుల దీపాలతో ముస్తాబు చేశారు, పాణ్యం షాలేము ప్రార్ధనా మందిరం, బలపనూరు, కౌలూరు, నెరవాడ, గోనవరం తదితర గ్రామాలలోని చర్చిలు క్రిస్మస్‌ సందర్భంగా ముస్తాబయ్యాయి.

Updated Date - Dec 25 , 2024 | 12:46 AM