Share News

ముగిసిన రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:47 AM

జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నంద్యాలలోని ఇండోర్‌ స్టేడియంలో రెండురోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి 68వ స్కూల్‌గేమ్స్‌ బాల, బాలికల అండర్‌-14టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారం ముగిశాయి.

ముగిసిన రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు
టేబుల్‌ టెన్నిస్‌ విజేతలతో అతిథులు

నంద్యాల, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నంద్యాలలోని ఇండోర్‌ స్టేడియంలో రెండురోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి 68వ స్కూల్‌గేమ్స్‌ బాల, బాలికల అండర్‌-14టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్‌, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నంద్యాల క్రీడాసమాఖ్య గౌరవాధ్యక్షుడు డా.రవికృష్ణ, ఎస్జీఎఫ్‌ టేబుల్‌ టెన్నిస్‌ రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు మెమెంటోలు, మెడల్స్‌, ప్రశంసా పత్రాలే అందజేశారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి శ్రీనాథ్‌, శాప్‌ టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ ముంతాజ్‌, ఏపీ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్ర, నాగరాజు, టోర్నమెంట్‌ టెక్నికల్‌ అడ్వయిజర్‌ విశ్వనాథ్‌, సీనియర్‌ పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 12:47 AM