సీపీఎస్‌ను రద్దు చేయాలి: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Sep 02 , 2024 | 12:33 AM
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య డిమాండ్ చేశారు.
నంద్యాల (రూరల్ ), సెప్టెంబరు 1: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య డిమాండ్ చేశారు. సెప్టెంబరు 1వ తేదీని పెన్షన్ విద్రోహ చీకటి దినంగా అభివర్ణిస్తూ నంద్యాలలోని తహసీల్దార్ కార్యాలయం ఎదటు ఏపీటీఎఫ్ నాయకులు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల పట్ల పెన్షన్ విధానాలలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై కాలయాపన సరికాదన్నారు. జాకీర్ హుసేన్, రాష్ట్ర కౌన్సిలర్ సుకుమాంబ కుమారి, శ్రీనివాసులు, పుల్లయ్య, వీరేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.