Share News

మహానందిలో భక్తుల సందడి

ABN , Publish Date - Dec 16 , 2024 | 12:06 AM

మహానంది క్షేత్రంలో ఆదివారం వేలాదిమంది భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించు కున్నారు.

 మహానందిలో భక్తుల సందడి
మహానందీశ్వరుడి దర్శనం కోసం క్యూలో నిలిచి ఉన్న భక్తులు

మహానంది, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో ఆదివారం వేలాదిమంది భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించు కున్నారు. శనివారం రాత్రే తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వివిధ వాహానాల ద్వారా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజామున్నే ఆలయ ప్రాంగణంలోని కోనేర్లల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. వేకువజామున స్వామి, అమ్మవార్లకు ఇచ్చే మహా మంగళ హారతి సేవలో పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 12:06 AM