AP News.. కర్నూలు జిల్లా: ఆ ఇద్దరికి గన్‌మెన్‌ల తొలగింపు
ABN , Publish Date - Apr 12 , 2024 | 07:43 AM
కర్నూలు: టీడీపీ నాయకురాలు కప్పట్రాళ్ల బుజ్జమ్మ, రామచంద్ర నాయుడు దంపతులకు వైసీపీ ప్రభుత్వం గన్‌మెన్‌లను తొలగించింది. వైసీపీలో ఉన్న కప్పట్రాళ్ల బుజ్జమ్మకు టు ప్లస్ వన్, రామచంద్ర నాయుడుకు వన్ ప్లస్ వన్ చొప్పున గన్ మెన్‌లను ఏర్పాటు చేసింది. ఇటీవలే బుజ్జమ్మ దంపతులు..
కర్నూలు: టీడీపీ (TDP) నాయకురాలు కప్పట్రాళ్ల బుజ్జమ్మ (Kappatralla Bujjamma), రామచంద్ర నాయుడు (Ramachandra Naidu) దంపతులకు వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) గన్‌మెన్‌లను (Gunmen) తొలగించింది. వైసీపీలో ఉన్న కప్పట్రాళ్ల బుజ్జమ్మకు టు ప్లస్ వన్, రామచంద్ర నాయుడుకు వన్ ప్లస్ వన్ చొప్పున గన్ మెన్‌లను ఏర్పాటు చేసింది. ఇటీవలే బుజ్జమ్మ దంపతులు టీడీపీలో చేరడం వల్ల ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డి గన్‌మెన్‌లను తొలగించారని బుజ్జమ్మ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్యాక్షన్ గ్రామంలో ఉంటున్న బుజ్జమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె వర్గీయులు కోరుతున్నారు.
కాగా 2023 జూన్‌లో టీడీపీ మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మ (సుశీలమ్మ) దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుశీలమ్మ.. ఆమె భర్త, దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా ఇటీవల కప్పట్రాళ్ల బొజమ్మ, .రామచంద్ర నాయుడు దంపతులు వైసీపీని వీడి మళ్లీ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గంలో బలమైన నాయకులుగా ఉన్న వీరంతా తిరిగి సొంతగూటికి వెళ్లారు. తామంతా తిరిగి టీడీపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని కప్పట్రాళ్ల బొజ్జమ్మ, డి.రామచంద్ర నాయుడు అన్నారు.
దివంగత నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడి హత్య అనంతరం ఆయన రాజకీయ వారసురాలిగా బొజ్జమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆస్పరి జడ్పీటీసీగా, ఆమె భర్త రామచంద్ర నాయుడు దేవనకొండ ఎంపీపీగా పని చేశారు. ఆ తర్వాత కోట్ల సుజాతమ్మ టీడీపీలోకి చేరడంతో.. బొజ్జమ్మ దంపతులు 2023 జూన్19న టీడీపీని వీడి వైసీపీలో చేరారు.