దీపావళి సందడి
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:30 PM
దీపావళి వైభవమంతా బాణసంచాలోనే ఉంది. పిల్లలు, పెద్దలు అంతా బాణసంచా కాల్చడానికి పండుగ కోసం ఎదురు చూస్తారు.
నంద్యాల కల్చరల్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దీపావళి వైభవమంతా బాణసంచాలోనే ఉంది. పిల్లలు, పెద్దలు అంతా బాణసంచా కాల్చడానికి పండుగ కోసం ఎదురు చూస్తారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల మైదానంలో బాణసంచా విక్రయ కేంద్రాలను నెలకొల్పారు. బుధవారం నుంచి స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో బాణసంచా విక్రయాలు మొదలయ్యాయి. సుమారు 76 స్టాళ్లు ఏర్పాటుచేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు,దుకాణాలు పెరగడం వల్ల దుకాణాలు వద్ద జనం సందడి అంతంత మాత్రంగానే ఉంది. బాణసంచా బ్రాండెడ్ రకం ఒక ధర, అన్ బ్రాండెండ్ ఽఉత్పతులు తక్కువ ధర పలుకుతున్నాయి. బాణసంచా ధరలతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. రూ.1000 పెట్టినా చేతికి సరిపడే బాణసంచా వచ్చేలా లేదు. పెరిగిన ముడి సరుకు ధరలు, శివకాశీ నుంచి రవాణా ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర పన్నులు కలిసి స్వల్ప లాభంతోనే అమ్ముతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారులు మాత్రం గతంలో రూ. 38 వేలు బాడుగ చెల్లించేవారమని ప్రస్తుతం రూ. 42 వేలు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు కూడా అతంతమాత్రమే ఉన్నాయన్నారు.