నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:42 AM
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి మంగళవారం నంద్యాలకు చెందిన డి.ప్రభావతమ్మ అనే భక్తురాలు రూ. 1,00,116 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందజేశారు.
శ్రీశైలం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి మంగళవారం నంద్యాలకు చెందిన డి.ప్రభావతమ్మ అనే భక్తురాలు రూ. 1,00,116 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.