బకాయిలు చెల్లించాలి: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:33 AM
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు మహబూబ్‌బాషా, నాగన్న డిమాండ్ చేశారు.
గడివేముల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు మహబూబ్‌బాషా, నాగన్న డిమాండ్ చేశారు. గడిగరేవుల హైస్కూల్‌లో బుధవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 2023 జూలై 23 నుంచి నూతన పీఆర్సీ అమలు కావాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించి పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. అంతవరకు 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించి అమలు చేయాలన్నారు. ఏపీజీఎల్‌ఐ ఫైనల్ మెచ్యూరిటీ మొత్తాలను, ఆర్జీత సెలవుల నగదును ఉపాధ్యాయుల ఖాతాలో జమ చేయాలని అన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను, వివిధ రకాల యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌లను పరిష్కరించకపోతే ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబరు 16, 17 తేదీల్లో జిల్లాస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏపీటీఎఫ్ నాయకులు మానపాటి రవి, ఆవుల మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.