టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి: ఎంపీ
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:22 AM
టీడీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు.
మిడుతూరు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. రోళ్లపాడులో బుధవారం ఎంపీ శబరి సమక్షంలో ఆ గ్రామ సర్పంచ్ పేరెడ్డి వెంకటరామిరెడ్డితో పాటు ఆయన వర్గీయులు 300 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రోళ్లపాడు గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని, పశువైద్య సిబ్బందిని నియమించాలని గ్రామస్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం చెరుకుచెర్ల గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకుచెర్ల రఘురామయ్య, మిడుతూరులోని తువ్వా భగీరథ రెడ్డి, తువ్వా అయ్యపు రెడ్డి నివాలకు వెళ్లి టీడీపీ సభ్యత్వ నమోదు చేయించాలని ఎంపీ సూచించారు. నందికొ ట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, భగీరథరెడ్డి, గుండం స్వామిరెడ్డి, సీతారామిరెడ్డి, అంకి రెడ్డి, అయ్యపురెడ్డి, రామసుబ్బారెడ్డి, తిమ్మారెడ్డి, రామ చంద్రుడు, గోకారి, మౌలాలి, జీవరత్నం పాల్గొన్నారు.
నందికొట్కూరు పట్టణంలో ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేసిన దీపావళి దీపాలు వెలుగించు కార్యక్రమంలో, ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ శబరి పాల్గొన్నారు. గత ఏడాది ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, డా.కాకరవాడ చిన్న వెంకటస్వామి, కౌన్సిలర్ చాంద్‌బాషా, అశోక రత్నం, సాహెబ్‌ఖాన్, బంగారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తనిఖీ చేశారు. కళాశాలలో సమస్యలు, సిబ్బంది కొరత తదితర అంశాలపై అధ్యాపకులు ఎంపీకి వినతిపత్రం ఇచ్చారు.