సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:13 AM
సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల రూరల్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం మంత్రి ఫరూక్ గ్రీవెన్ సెల్ నిర్వహించారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను మంత్రి దృష్టికి తీకెళ్లారు. గ్రీవెన్‌సెల్‌కు వచ్చిన వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. పరిష్కారం కోసం వీటిని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు.